English | Telugu

మా అమ్మాయిని జబర్దస్త్ లో పర్మనెంట్ చేయండి

ఎక్స్ట్రా జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమో చూడడానికి భలే ఫన్నీగా ఉంది. నెక్స్ట్ వీక్ ఈ షోలో ప్రసారమయ్యే స్కిట్స్ ఫుల్ ఎంటర్టైన్ చేసేలా కనిపిస్తున్నాయి. దానికి సంబంధించిన ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇందులో ఫైనల్ లో మాత్రం ఇమ్మానుయేల్ ఆర్యలో అల్లు అర్జున్ ని ఇమిటేట్ చేసాడు. వర్ష హీరోయిన్ గెటప్ లో కనిపించింది. శివబాలాజీ రోల్ లో కమెడియన్ బాబు వచ్చాడు. "నా పేరు ఆర్య..నేను అందరినీ ప్రేమిస్తూ ఉంటాను. చిరంజీవి వస్తున్నారు...మధ్యమధ్యలో ప్రకాష్ రాజు గారు వస్తారు" అనే చెప్పేసరికి ఖుష్బూ నవ్వేశారు. తర్వాత సైకిల్ వేసుకుని వర్ష చుట్టూ తిరుగుతూ "ఐ లవ్ యు..ఏంటి చెవులు దొబ్బాయ.. ఏంటి బలుపు...ఎవరు డిజైనర్ డ్రెస్"కి అనేసరికి వర్ష, రష్మీ నవ్వేశారు.

ఇక ఈ షోలో రాకింగ్ రాకేష్ స్కిట్ కూడా చాలా ఫన్నీ ఉండబోతోందన్న విషయం ప్రోమోలో చూస్తేనే అర్ధమవుతుంది. "రాకింగ్ రాకేష్ హాస్టల్" పేరుతో ఈ స్కిట్ వేసాడు. హాస్టల్ లో చేర్పించడానికి ఒక స్టూడెంట్ ని తీసుకుని వాళ్ళ మదర్ వచ్చారు. అప్పుడే డీటెయిల్స్ నోట్ చేసుకుంటున్న రాకేష్ "ఏం చేయమంటారు మీ పాపను" అనేసరికి "జబర్దస్త్ లో పర్మనెంట్ చేయండి" అని ఆ స్టూడెంట్ మదర్ అనేసరికి "అంటే నేను అడుగుతున్నది మీ పాపను ఎందులో జాయిన్ చేయమంటారు అని" మళ్ళీ అడిగాడు రాకేష్. "జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్, ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీ ఆఖరికి బాబాయ్ హోటల్ ఐనా సరే పేమెంట్ ఉండాలి" అని ఆమె చెప్పేసరికి అందరూ నవ్వేశారు. ఆర్య గెటప్ లో ఇమ్ము, అలాగే వర్ష హీరోయిన్ గా చాలా బాగుంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Brahmamudi: రాహుల్ మనిషిని పట్టుకున్న రాజ్, కావ్య.. ఇక దేత్తడి!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -905 లో....అప్పు పాప కేసు ఫైల్ చూస్తుంటే ఆఫీసర్ వస్తాడు. నీకు ఎన్నిసార్లు చెప్పాను వద్దని అయినా అలాగే చేస్తున్నావని కోప్పడతాడు. లేదు సర్ పాప చనిపోలేదు.. చనిపోయిన పాప వేరు.. ఆ పాప DNA తో మ్యాచ్ అవ్వడం లేదని రిపోర్ట్స్ చూపించగానే అవునా కేసులో ఒక కొత్త మలుపు తీసుకొని వచ్చావ్ గుడ్ కేరియాన్ అని ఆఫీసర్ అంటాడు. కాసేపటికి రేపు పాప వాళ్ళ ఫాదర్ ని స్టేషన్ కి రప్పించండి అని కానిస్టేబుల్ తో అప్పు చెప్తుంది. మరొకవైపు రాహుల్ అవార్డు ఫంక్షన్ కి రాజ్, కావ్య వెళ్తారు. అక్కడ రాహుల్ డిజైన్స్ చూసి రాజ్, కావ్య షాక్ అవుతారు.

Karthika Deepam2: జ్యోత్స్న చేసిన ఫ్రాడ్ చూసి కార్తీక్, శ్రీధర్ షాక్.. ఇంటి వారసురాలు కాదేమో!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -542 లో..... కార్తీక్, శ్రీధర్ జ్యోత్స్న రెస్టారెంట్ ఫుడ్ ట్రక్స్ బాగా పాపులర్ అయ్యాయని హ్యాపీగా ఉంటారు. ఇద్దరు బయట టీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటారు. జ్యోత్స్న చాలా తప్పు డు లెక్కలు చూపించిందని శ్రీధర్ అనగానే ఎంత మొన్న కొన్న ల్యాండ్ గురించా అని  కార్తీక్ అడుగుతాడు. లేదు అది జస్ట్ శాంపిల్ మాత్రమే.... ఎంత అంటే అది చెప్తే శివన్నారాయణ గుండె పట్టుకొని పడిపోయేంత డబ్బులు ఫ్రాడ్ చేసిందని శ్రీధర్ అనగానే కార్తీక్ షాక్ అవుతాడు.