English | Telugu

చూడు పిన్నమ్మ పాడు పిల్లాడు... గ్యాప్ ఇవ్వకండి మాష్టర్...


ఢీ సెలబ్రిటీ స్పెషల్ 2 షో నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో ఒక్కో పెరఫార్మెన్స్ ఒక్కో రేంజ్ లో ఉంది. ఐతే ఇందులో ఫస్ట్ లవ్ గురించి నందు ఒక ప్రశ్న అడిగేసరికి ఆది ఫస్ట్ లవ్ గురించి చెప్పాలంటూ శేఖర్ మాష్టర్ అడిగాడు. అప్పుడు ఆది తన సెవెంత్ క్లాస్ స్టోరీ గురించి చెప్పాడు. "మా క్లాస్ లో నేను లాస్ట్ లో కూర్చునేవాడిని..అమ్మాయిలంతా ముందు కూర్చునేవారు. అందులో ఒక అమ్మాయి అలా వెనక్కి తిరిగి నన్నే చూస్తూ ఉండేది. తర్వాత ఒక రోజు నేను వెళ్లి ఎందుకు అలాగే చూస్తున్నావు అని అడిగాడు. దానికి ఆ అమ్మాయి మా అన్నయ్య అచ్చం మీలాగే ఉంటాడు అని చెప్పింది. మిమ్మల్ని అన్నయ్యలా చూసుకుంటాను మీరేమీ అనుకోరు కదా అని అన్నది. ఇంకో సారి నా వైపు చూస్తే కళ్ళు పీకేస్తా అని చెప్పా " అంటూ తన స్టోరీ చెప్పుకొచ్చాడు.

తర్వాత శేఖర్ మాష్టర్ చెప్పాడు " లవ్ ఎక్కడా స్టార్ట్ అయ్యిందంటే హైదరాబాద్ వచ్చిన కొత్తలో కర్నూల్ వెళ్ళాం. ఒక డాన్స్ షో ఉందని అక్కడికి వెళ్లాం. అక్కడికి వెళ్లాం నైట్ అని గ్యాప్ ఇచ్చాడు శేఖర్ మాష్టర్. దానికి నందు వచ్చి "గ్యాప్ ఇవ్వకండి మాష్టర్" అని చెప్పాడు. ఐతే ఈ షోలోకి ప్రభుదేవా మాష్టర్ రావడంతో పండు మాష్టర్ బట్టలు సర్దేసుకుని వచ్చాడు. "ఏంటి పండు వెళ్ళిపోతున్నావా నువ్వు" అని అడిగాడు. "పండు వెళ్ళిపోదాం అనుకున్నాడు కాబట్టే ప్రభుదేవాను పిలిచాడు. అంతా ప్రభుదేవా చూసుకుంటాడు" అన్నాడు ఆది కూడా. తర్వాత రెడీ అయ్యి బట్టలు తీసుకుని వెళ్ళిపోదామని అనుకున్నా హన్సిక దగ్గరకు వెళ్ళాడు. అక్కడ హన్సిక అమ్మాయిలా మేకప్ చేసింది. దాంతో అచ్చు "చూడు పిన్నమ్మ పాడు పిల్లాడు" అనేలా ఉన్నాడు.

Podharillu:పొదరిల్లు సీరియల్ లో సూపర్ ట్విస్ట్.. మహాలక్ష్మికి పెళ్ళి ఫిక్స్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -02 లో.....మహాలక్ష్మి ప్రాజెక్ట్ డిజైన్ రెడీ చేసి హాల్లోకి వస్తుంది. వాళ్ళ నాన్న ప్రతాప్ ఇంకా అన్నయ్య మహాలక్ష్మికి డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తారు. ఒకసారి చూడు మహా అని వాళ్ళ అన్నయ్య అంటాడు. నాకేం ఇప్పుడు పెళ్లి వద్దు అవసరం అయితే వదిన నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోండి అని మహా అంటుంది. ఇప్పుడు డిజైన్స్ చూపించడానికి వెళ్తున్నానని తెలిస్తే డాడీ వద్దని అంటాడనుకొని డాడీ కాలేజీలో సర్టిఫికెట్ ఉన్నాయి తెచ్చుకుంటానని చెప్తుంది.