English | Telugu
శ్రద్ధాకు ఫోటోగ్రాఫర్ ని అవుతానంటున్న ఆది..ముగ్గు ఎలా వేయాలో నేర్పిస్తానంటున్న జెస్సి!
Updated : Dec 21, 2022
ఢీ-ఛాంపియన్ షిప్ బ్యాటిల్ ఎప్పటిలాగే ఈ వారం కూడా బాగా నవ్వించింది. డ్యాన్సుల కన్నా కూడా హైపర్ ఆది స్కిట్స్ పంచెస్ ఈ షో మొత్తాన్ని డామినేటింగ్ చేసేస్తున్నాయి . ఈ వారం ఎపిసోడ్ లో లుంగీ గురించి పెద్ద స్పీచ్ ఇచ్చాడు ఆది. హోస్ట్ ప్రదీప్ లుంగీని అవమానించేసరికి చాలా ఫీలయ్యాడు. దాంతో ఆదికి కోపం వచ్చి తన లుంగీకి సారీ చెప్పాలని బట్టుబట్టి చెప్పించుకున్నాడు.
తర్వాత కో-కమెడియన్ జెస్సి వచ్చి "దేవుడు నీ ముందు ప్రత్యక్షమై వరం కోరుకోమంటే నువ్వేం కోరుకుంటావు" అని ఆదిని అడిగేసరికి "శ్రద్ధాదాస్ కి ఫోటోగ్రాఫర్ గా పుట్టాలని కోరుకుంటా..ఆవిడ ఫోటోషూట్స్ చూసావా నువ్వు..తెలియని అందం ఉంటుంది శ్రద్దాలో..ఫొటోగ్రాపర్ ఐతే ఆమె అందాన్ని ఆస్వాదించొచ్చు " అని చెప్పాడు. అరేయ్.. శ్రద్దా మా పక్క ఫ్లాట్ లో నువ్వు ఉండాల్సింది కానీ వేరే అమ్మాయి ఉంటోంది అనేసరికి తలుపు తీసుకుని మరో కో-కమెడియన్ ముగ్గు గిన్నె పట్టుకుని ఢీ స్టేజి మీద ముగ్గేయడానికి వచ్చింది.
ఇక జెస్సి ఆ అమ్మాయిని పటాయించాడు. ముగ్గు ఎలా వేయాలో చుక్కలు ఎలా పెట్టాలో చేసి చూపించాడు ఆది, జెస్సి.