English | Telugu
క్రిస్మస్ సెలబ్రేషన్స్ లో మునిగి తేలుతున్న యాంకర్ శ్యామల!
Updated : Dec 22, 2022
యాంకర్ శ్యామల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కాకినాడకు చెందిన ఈమె మొదట్లో సీరియల్స్ లో తర్వాత సినిమాలలో కూడా చేసింది. మూవీ ప్రొమోషన్స్, ఫ్రీ రిలీజ్ ఈవెంట్స్, సక్సెస్ మీట్ లు వంటి వాటికి హోస్ట్ గా వ్యవహరిస్తోంది. అంతేకాదు సోషల్ మీడియాలో గ్లామర్ షో చేయడంలో కూడా ఎక్కడా తగ్గడం లేదు.
అలాంటి శ్యామల ఇప్పుడు క్రిస్మస్ సెలెబ్రేషన్స్ లో మునిగితేలుతోంది. ఇంట్లో క్రిస్మస్ ట్రీ, స్టార్స్, లైట్స్ అన్ని డెకరేట్ చేసుకుని సెలెబ్రేట్ చేసుకుంటోంది. కాండిల్ పట్టుకుని ఆ వెలుగుల్లో శ్యామల అందంగా మెరిసిపోతోంది.
సీరియల్ యాక్టర్ నరసింహారెడ్డిని లవ్ మ్యారేజ్ చేసుకున్న శ్యామల తన ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తూ ప్రొఫెషనల్ లైఫ్ ను కూడా చక్కగా బ్యాలెన్స్ చేసుకుంటోంది. శ్యామల భర్త కూడా బుల్లితెర నటుడే..కార్తీకదీపం సీరియల్ లో దుర్గ పాత్రతో బాగా పేరు తెచ్చుకున్నాడు. అలాగే ఎక్సపోజ్డ్ వెబ్ సిరీస్ లో మిత్ర పాత్రలో నటనకు స్కోప్ ఉన్న పాత్రలో కనిపిస్తూ అలరిస్తున్నాడు.