English | Telugu
ఎవడ్రా నువ్వు.. డర్టీ ఫెలో.. ఆదిని తన బాయ్ ఫ్రెండ్ తో తిట్టించిన రష్మీ
Updated : Dec 31, 2023
2023 ఇయర్ ఎండింగ్ సెలెబ్రేషన్స్ బుల్లితెర మీద మొదలైపోయాయి. మరి పుష్ప 2 కంటే కూడా రష్మీ పెళ్లి ఎప్పుడు అనే టాపిక్ జనాల్లో ఎక్కువగా ఉందంటూ రష్మీ తాను చేసుకోబోయే అబ్బాయిని ఇయర్ ఎండింగ్ రోజున చూపించేసింది. ఇక పెళ్లి పెద్దలుగా ఆది, రాంప్రసాద్ కలిసి ఆయన్ని ఫుల్ ఆడేసుకున్నారు.
"రష్మీ పెళ్లి పార్టీ" పోటీ పేరుతో మల్లెమాల వాళ్ళు దాదాపు రెండు గంటల వ్యవధి ఉన్న ఒక ఈవెంట్ ని ప్రసారం చేశారు. అందులో రష్మీ పెళ్లి ఎప్పుడు అంటూ ఆది అడిగేసరికి ఆమె సిగ్గుపడుతూ ఒక ఆరడుగుల అందగాడిని స్టేజి మీదకు తీసుకొచ్చింది. చమ్మక్ చంద్ర అతన్ని చూసి సర్ తెలుగునా, తమిళమా, కన్నడనా అని అడిగేసరికి అరె రండి మన రష్మీని అంత ఈజీగా చేసుకుంటాడా..రండి టెస్ట్ చేద్దాం అంటూ ఆది, రాంప్రసాద్ ఇద్దరూ బాగా ఆడుకున్నారు.."ఇంతకు నీ పేరేమిటి" అనేసరికి "సాకుల్ శర్మ నా పేరు నాకు రోహిత్ శర్మ కూడా తెలుసు..ఎవుడ్రా నువ్వు" అని ఆదిని గట్టిగానే అడిగాడు. "నేను ఆల్రెడీ చూసాను..మీరు రష్మీని చాల ఫ్లర్ట్ చేస్తున్నారా " అని అడిగేసరికి "నీకంటే నాది రెండు ఎకరా ఎక్కువా..హైట్ లో ..డర్టీ మైండ్ ఫెల్లో " అని మళ్ళీ పంచ్ వేసాడు. "ఈ జుట్టు ఒరిజినలా ప్లాంటేషన్ ఆ" అని రాంప్రసాద్ అడిగేసరికి "ప్లాంటేషన్ లేదు జెనెటికల్ ఉంది" అని కౌంటర్ ఇచ్చాడు. "రష్మిని ముద్దుగా ఏమని పిలుస్తావ్" అని ఆది అడిగేసరికి "నా హనీ" అని చెప్పాడు. బాబు ఫ్లోలో అన్నీ చెప్పేస్తున్నావా పక్కన నిలబడు అని రష్మీ అసలు సీక్రెట్ ని రివీల్ చేసింది..."సాకుల్ శర్మ నా కాలేజీ మేట్.. కాలేజీలో నన్ను బాగా ఫ్లర్ట్ చేసేవాడు. సరే ఇక్కడ నా పెళ్లి పార్టీ కాబట్టి పిలిచాను అంతే" అని రష్మీ ప్రాంక్ చేసేసరికి "ఐతే పెళ్ళికొడుకు ఇతను కాదా" అని అడిగాడు ఆది "కాదు" అని చెప్పింది రష్మీ.