English | Telugu
నీ నటనకి ఆస్కార్ ఇచ్చిన తక్కువే.. అమ్మ పర్ఫామెన్స్ కి ఫిధా!
Updated : Nov 2, 2023
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్- 909 లో.. రిషి, వసుధారలు సంతోషంగా ఉండటం చూసిన మహేంద్ర మురిసిపోతాడు. ఇక జగతిని తల్చుకొని..వీళ్ళిద్దరి సంతోషాన్ని చూడు జగతి అని మహేంద్ర అనుకుంటాడు.
ఆ తర్వాత రిషి, వసుధార ఇద్దరు ప్రేమగా మాట్లాడుకుంటారు. నీ కళ్లు ఎంత అందంగా కనిపిస్తున్నాయో? అని రిషి అనగా.. ఎలా ఉన్నాయని వసుధార అడుగుతుంది. కలువరేకుల్లా ఉన్నాయని రిషి అంటాడు. మీరు అలా అంటే ఏదో మైకంలా ఉందని అంటుంది. ఇక రిషి రొమాంటిక్ గా వసయధారకి దగ్గరగా వెళ్ళి కిస్ ఇవ్వబోతుండగా.. దేవయాని నుండి కాల్ వస్తుంది. ఇక మంచి మూడ్ లో ఉన్న రిషి.. ఇప్పుడు ఈ కాల్ అవసరమా అని అన్నట్టు మాట్లడగా.. మాట్లాడండి సర్ వసుధార అంటుంది. ఇక దేవయాని ఫోన్ కాల్ లో తన కపట ప్రేమని వొలకబోస్తూ నటిస్తుంది. " రిషి నాన్న.. నువ్వు రా నాన్న.. నీకు దూరంగా ఉండలేకపోతున్నాను.
నేను అంత కానీ దాన్ని అయ్యానా?మీ అన్నయ్య అయితే మరీ దారుణం. నువ్వు లేకపోయేసరికి చిన్నపిల్లాడిలా ఒక్కడే కూర్చొని వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు" అని దేవయాని అంటుంది. అదేంటి పెద్దమ్మ, ఎందుకు అంతలా ఫీల్ అవుతున్నారని అనగా.. అదేంటి రిషి బాధ ఉండదా? వచ్చేయ్ నాన్న మన ఇంటికి వచ్చేయ్. నా వల్ల ఏదైనా తప్పు జరిగి ఉంటే క్షమించు నాన్న. నువ్వు వెళ్ళూ వెళ్తూ లగేజ్ నే కాదు. ఈ పెద్దమ్మ మనసుని కూడా తీసుకెళ్ళావ్. తిరిగి వచ్చేయ్ అని దేవయాని అంటుంది. కొన్నిసార్లు బాధ అనివార్యమే అని రిషి అంటాడు. మీ మాట ప్రకారం నేను అక్కడికి వస్తే నేను అనుకున్నది జరుగదని రిషి అనగా.. అవునా మరి ఈ పెద్దమ్మ కోసం రావా అని దేవయాని అంటుంది. అమ్మని కనిపెట్టేవాళ్ళని కనిపెట్టాకే వస్తానని రిషి అంటాడు. నువ్వు మాత్రం రావాలి. లేదంటే పచ్చి మంచినీళ్ళూ కూడా ముట్టుకోనని దేవయాని అనగా.. వీలు చూసుకొని వస్తానని రిషి అంటాడు.
ఇక ఫోన్ కట్ చేసాక మహేంద్ర.. మీ పెద్దమ్మ ఫోన్ చేసినట్టుంది, ఏమంటుందని రిషిని అడుగుతాడు. మీ రిషి గురించి మీకు తెలియదా? మీకు మాటొస్తే నాకు మాటొచ్చినట్టే? ఏ ఇంట్లో అయితే మీరు అవమానాలు పడ్డారో అక్కడ మిమ్మల్ని నిలబెట్టలేను. నేను ఒక్కడినే వెళ్తున్నాని రిషి అంటాడు. మీ అమ్మ చావుకి కారణం అయిన వెదవల్ని క్షమించే ప్రసక్తే లేదని మహేంద్ర అనగానే.. ఒకవేళ వాళ్ళని క్షమించే పరిస్థితి వస్తే అని వసుధార అంటుంది. అది పిచ్చి ప్రశ్న వసుధార, వాళ్ళెవరైనా సరే క్షమించే ప్రసక్తే లేదని రిషి అంటాడు. మరొకవైపు దేవయానిని శైలేంద్ర పొగుడుతుంటాడు. మీ నటనికి ఆస్కార్ ఇవ్వాల్సిందేనని శైలేంద్ర అంటాడు. నా మాటలకి వెళ్ళిపోయిన రిషిని ఈ రోజు తన నోటితోనే ఈ ఇంటికి వస్తాను అని అనిపించాను" అని దేవయాని అంటుంది. ఆ తర్వాత కాలేజ్ ని సొంతం చేసుకుంటానని శైలేంద్ర అంటాడు. అనుపమ గురించి తెలుసుకున్నావా అనగా.. తనకేం తెలియదని, ఒకవేళ మనకి తను ఎదురొస్తే తనకే ప్రాబ్లమ్ అని శైలేంద్ర అంటాడు. మరొకవైపు అనుపమ తన గదిలో గత జ్ఞాపకాలు తల్చుకొని బాధపడుతుంటుంది. ఇక అనుపమ వాళ్ళ పెద్దమ్మ వచ్చి.. నిన్ను చూస్తుంటే బాధగా ఉంది. నీ మనసు నీ గత జ్ఞాపకాలు కలచివేస్తున్నాయని అంటుంది. చివరికి కాలం నా మనసుని రాయిగా మార్చేసింది అందుకే అందరికి దూరంగా వెళ్ళి బతుకున్నాని అనగా.. మనుషులకి దూరం అవ్వొచ్చు కానీ జ్ఞపకాలని చెరిపేయలేమని, అందుకే నువ్వు మళ్ళీ వెనక్కి వెళ్ళాలని, నీ గతంలోకి వెళ్ళాలని, నువ్విలా దూరంగా ఉండి నీ మనసుని మార్చుకోలేకపోతున్నావ్. నీ కోపం తగ్గించుకోవాలని అనుపమతో వాళ్ళ పెద్దమ్మ అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.