English | Telugu
రుద్రాణికి దిమ్మదిరిగే షాకిచ్చిన దీప
Updated : Dec 21, 2021
బుల్లితెర మహిళా ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటున్న ధారావాహిక `కార్తీక దీపం`. మోనిత కుట్ర కారణంగా డాక్టర్ వృత్తికి దూరమై అవమాన భారంతో దీప, పిల్లలతో కలిసి కార్తీక్ ఇల్లు వదిలి, సిటీ వదిలి వేరే గ్రామానికి చేరుకున్న విషయం తెలిసిందే. అక్కడ దాక్షాయణి కారణంగా కార్తీక్ కుటుంబం మళ్లీ ఇబ్బందుల్లో పడుతుంది. ఈ నేపథ్యంలో డాక్టర్ బాబు .. రుద్రాణికి ఓ నోటు రాసిస్తాడు.
Also read:నిన్నటి వరకు సిరి ఫ్రెండ్.. కానీ ఇప్పడు పెళ్లాం?
అతనికే తెలియకుండా తను డబ్బు కట్టని పక్షంలో ఇద్దరు పిల్లల్లో ఒక పాపని తాను తీసుకొచ్చాసుకుంటానని అగ్రిమెంట్ చేసుకుంటుంది దాక్షాయణి. కట్ చేస్తే.. మంగళవారం ఎపిసోడ్ మరింత ఆసక్తికరంగా సాగబోతోంది. అవమాన భారంతో ఊరు విడిచి, సొంత వారిని కాదనుకుని తెలియని చోటుకి వచ్చి తలదాచుకుంటున్న కార్తీక్ , దీపలని దాక్షాయణి టార్గెట్ చేస్తుంది. తన కుటుంబాన్ని టార్గెట్ చేసిందని తెలుసుకున్న దీప .. రుద్రాణికి ఎలాంటి షాకిచ్చిందన్నది ఓసారి చూద్దాం.
Also read:ఎలిమినేట్ అయిన సిరి.. హౌస్ బయటకు తెచ్చిన రష్మిక-దేవి!
కార్తీక్ ఇద్దరు పాపలు కనిపించలేదని కంగారుపడుతూ దీపని అడుగుతాడు.. ఇంతలో అతనికి రుద్రాణి అన్న మాటలు గుర్తొస్తాయి. వెంటనే దీప బయట చూశారా? అని అడుగుతుంది. చూశాను దీప కనిపించలేదంటాడు కార్తీక్. దీంతో కంగారు పడిన దీప బయట చూద్దామంటూ బయటికి వచ్చేస్తుంది. అక్కడే చెట్టుకింద ఇద్దరు పిల్లలు కూర్చుని కనిపిస్తారు. మనం నాననమ్మ దగ్గరికి వెళ్లిపోదామని రౌడీ అంటుంది. కట్ చేస్తే .. దీప తన నగలమ్మి డబ్బు తీసుకురావడానికి వెళుతుంది. కానీ తాకట్టుపెట్టుకోవడానికి నగల వ్యాపారి ఇష్టపడడు. రుద్రాణి చెప్పడంతో దీప నగలు తీసుకోవడానికి నిరాకరిస్తాడు. కారణం రుద్రాణి అని తెలుసుకున్న దీప వెంటనే ఫోన్ చేసి షాకిస్తుంది. వెంటనే రుద్రాణి దీపకు డబ్బులు ఇవ్వమని సేటుతో చెబుతుంది.. ఇంతకీ దీప ఏం చేసింది? ఎందుకు రుద్రాణి సేటుతో డబ్బులు ఇవ్వమని చెప్పింది అన్నది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.