English | Telugu

Karthika deepam2 : ఎంగేజ్ మెంట్ కి వాళ్ళు వస్తారా.. జ్యోత్స్న టెన్షన్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika deepam 2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -309 లో... కాంచనని ఎంగేజ్ మెంట్ కి పిలవమని శివన్నారాయణతో దశరథ్ అంటాడు. వద్దు నేను పిలవలేనని శివన్నారాయణ ఖచ్చితంగా చెప్పి వెళ్ళిపోతాడు. దాంతో దశరథ్, సుమిత్ర ఇద్దరు బాధపడుతారు. మీరేం బాధపడకండి నేను తాతయ్యని ఒప్పిస్తానని జ్యోత్స్న అంటుంది.

ఏంటి నువ్వు అనేదని సుమిత్ర అంటుంది. అవును నేను ఇప్పుడే అత్తయ్య ఇంటి నుంచి వస్తున్నాను. నాతో బాగా మాట్లాడింది. మీరు పిలవండి ఆఫీషియల్ గా తాతయ్య పీల్చేలా నేను ఒప్పిస్తానని జ్యోత్స్న అంటుంది.

ఇన్ని రోజులు బాధపెట్టావ్.. ఇప్పుడు హ్యాపీగా ఉంచుతున్నావని జ్యోత్స్నని చూసి సుమిత్ర మురిసిపోతుంది. జ్యోత్స్న లో ఈ మార్పు నాకు డౌట్ గానే ఉంది.. దాస్ ని ఎందుకు చంపాలననుకుందో తెలిసేవరకు ఏం అర్ధం కాదని దశరథ్ అనుకుంటాడు. ఆ తర్వాత కార్తీక్ కి దీప కాఫీ తీసుకొని వస్తుంది. దీప వెళ్తుంటే కార్తీక్ కొంగు పట్టుకొని ఆపుతాడు. దాంతో దీప టెన్షన్ పడుతుంది. కొంగు కి ఏదో ఉంది అంటూ తుడుస్తాడు.

ఆ తర్వాత కాంచనకి దశరథ్ ఫోన్ చేసి మాట్లాడతాడు. నేను నీ కూతురు ఎంగేజ్ మెంట్ కి రాకపోవచ్చు కానీ నా మేనకోడలకి ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయని కాంచన బాధపడుతుంది. అదంతా కార్తీక్, దీప వింటారు. కార్తీక్ అక్కడ నుండి వెళ్ళిపోయాక.. మీరు మీ మేనకోడలిని కోడలిని చేసుకోనందుకు ఎంత బాధడుతున్నరో తెలుస్తుందని దీప అంటుంది. నువ్వే నా మేనకోడలు అనుకుంటానని కాంచన అంటుంది. ఆ తర్వాత దీప బాధపడుతుంటే.. నువ్వెందుకు బాధపడుతున్నావ్.. మా అమ్మా నిన్ను మేనకోడలు అనుకుంటుంది కదా అని కార్తీక్ అంటాడు. ఆ తర్వాత జ్యోత్స్న పారిజాతం కలిసి కార్తీక్ రెస్టారెంట్ కి వస్తారు. నేను చెప్పినట్టు చెయ్ అని పారిజాతంని లోపలికి పంపిస్తుంది జ్యోత్స్న. లోపలికి వెళ్లి పారిజాతం ఎంగేజ్ మెంట్ ఫుడ్ ఆర్డర్ ఇస్తుంది. డబ్బు కూడా అడ్వాన్స్ గా అక్కడ మేనేజర్ కి ఇస్తుంది. అప్పుడే కార్తీక్, దీప ఇద్దరు వస్తుంటే జ్యోత్స్న టెన్షన్ పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial: వీరూ ప్లాన్ ని కనిపెట్టిన గంగ.. రుద్ర తెలుసుకుంటాడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -146 లో.... రుద్రకి ఎదురుగా గంగ వెళ్తుంది కానీ రుద్ర ఫోన్ మాట్లాడుతూ వెళ్ళిపోతాడు. కొంచెం దూరం వెళ్ళగానే రుద్రకి రింగ్ కనిపిస్తుంది. అది తీసుకొని చూస్తాడు. అప్పుడే ప్రమీల, ప్రీతీ వస్తారు. అన్నయ్య ఆ రింగ్ గంగ వదినది అని ప్రీతీ అంటుంది. ఈ రింగ్ ప్రపంచంలో ఆవిడకి ఒక్కదానికే ఉందా ఏంటని రుద్ర అంటాడు. ఆ తర్వాత అటుగా వెళ్తున్న గంగని రుద్ర పిలుస్తాడు. గంగ ముసుగులో ఉంటుంది. రుద్ర పిల్వగానే వస్తుంది. ఈ రింగ్ మీదేనా అని అడుగుతాడు. గంగ నాదేనని తీసుకుంటుంది..