English | Telugu
సరిగమప ది సింగింగ్ సూపర్ స్టార్ శృతిక!
Updated : Aug 16, 2022
సరిగమప ది సింగింగ్ సూపర్ స్టార్ ప్రోగ్రాం ముగిసింది. 26 వారాల పాటు అందరినీ అలరించింది. ఇక ఇండస్ట్రీకి కొత్త కొత్త గాయకులు ఈ వేదిక ద్వారా పరిచయమయ్యారు. ఈ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ లో లెజెండరీ సింగర్ సుశీల, నితిన్, శృతిహాసన్, కృతి శెట్టి పాల్గొన్నారు. ఈ షో మొత్తం ధూమ్ ధామ్ గా సాగిపోయింది. ఫైనల్ గా ఈ షో విన్నర్ గా హైదరాబాద్ కి చెందిన 20 ఏళ్ళ శృతిక సముద్రాలను అనౌన్స్ చేశారు కోటి. ఈమెకు మొదటి నుంచి గట్టి పోటీ ఇచ్చిన సుధాన్షు రన్నరప్ గా నిలిచాడు.
విన్నర్ ఏమేం గెలుచుకుంది అంటే..క్యాష్ ప్రైజ్ ఒక లక్ష, మారుతి సుజుకి కారు, ట్రోఫీ రాగా..సుధాన్షు కి 5 లక్షల క్యాష్ ప్రైజ్ వచ్చింది. చివరిలో విన్నర్ వర్డ్స్ చూస్తే తనకు ఈ షోలో పార్టిసిపేట్ చేయడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పింది. తనను మెంటార్స్ కూడా చాలా ట్రైన్ చేశారని వాళ్లందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పింది. ఈ షో ద్వారా ఎంతో మంది ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఈ గ్రాండ్ ఫినాలేలో తనతో పాటు సుధాన్షు కూడా బాగా పాడాడని కాబట్టి తనతో పాటు సమాన గుర్తింపు వస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. సింగర్ పార్వతి కూడా ఈ షో ద్వారా ఫుల్ ఫేమస్ అయ్యింది. ఇలా సరిగమప షో ఎండ్ అయ్యింది.