English | Telugu
వీడే నా బంగార్రాజు..అషుని దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్స్
Updated : Aug 16, 2022
ఎవరి పిచ్చి వారికి ఆనందం అనే డైలాగ్ ప్రతీ రోజు ఎవరో ఒకరి దగ్గర వింటూ ఉంటాం. ఇప్పుడు ఆ డైలాగ్ అషుకి సూపర్ గా సరిపోతుంది అనిపిస్తోంది. అషు ఇప్పుడు ఒక పెట్ ని అడాప్ట్ చేసుకుంది. రష్మీ కూడా పెట్ లవర్. ఏ మూగ జీవానికి ఏదైనా ఐతే మాత్రం వెంటనే తన ఇన్స్టా పేజీలో ఆ విషయం గురించి ఒక పోస్ట్ పెట్టేస్తుంది. ఇప్పుడు అషు కూడా రష్మీలా ఒక డాగ్ ని అడాప్ట్ చేసుకుంది. ఇక్కడి వరకు ఓకే. ఇక ఇప్పుడు పిచ్చి పీక్స్ కి వచ్చింది అంటున్నారు నెటిజన్స్ అషు పోస్ట్ చేసిన వీడియో చూసి. తన పెట్ పేరు రాజుగాడు అని చెప్తూ దానికి మేడలో నెక్లెస్, చేతులకు గాజులు తొడిగేసి సోఫాలో కూర్చోపెట్టి ఇద్దరూ తెగ ముద్దులు పెట్టేసుకున్నారు.
"మై బంగార్రాజు..మీ మనసులోని ప్రేమను మీ పెట్స్ మీద చూపించండి..అవి ఎప్పుడు మీ ప్రేమను బ్రేక్ చేయవు" అంటూ ఒక టాగ్ లైన్ పెట్టేసింది. కుక్కకి నాగార్జున పేరు పెట్టింది అషు, కుక్క ఇలా మూతి నాకుతూ ఉంది..అది బ్రష్ చేయదు..కోవిడ్ లాంటి రోగాలు ఇందుకే వస్తాయి ..అంటూ దారుణమైన కామెంట్స్ తో నెటిజన్స్ అష్షు ని సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోస్తున్నారు. సోషల్ మీడియాలో అష్షు ఎప్పుడూ ఏదో ఒక పోస్ట్ తో వార్తల్లో ఉంటూనే ఉంటుంది.