English | Telugu
కామన్ మ్యాన్ ఆదిరెడ్డి రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
Updated : Oct 10, 2022
బిగ్ బాస్ కంటెస్టెంట్, యూట్యూబ్ సెన్సేషన్ ఆదిరెడ్డి. ఇతని పూర్తి పేరు వెంకట ఆది నారాయణరెడ్డి. ఇతను నెల్లూరు జిల్లా వరికొండపాడులో జన్మించాడు. వీళ్లది మధ్యతరగతి కుటుంబం. ఇతను ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ చదివాడు. ఇతనికి భార్య, కూతురు ఉన్నారు. ఇతని సోదరి నాగలక్ష్మి. ఆమెకు పుట్టుకతోనే కంటి చూపు లేదు. లాక్డౌన్ లో ఆమె తనకొచ్చే పెన్షన్ డబ్బులు సోనూసూద్ ఫౌండేషన్ కి పంపించి, వార్తల్లో నిలిచింది. ఆమె అలా పంపించాక నేషనల్ న్యూస్ ఛానెల్ సైతం ఇంటర్వ్యూకి రావడంతో ఒక్కసారిగా వారి కుటుంబం మొత్తం ఫేమస్ అయ్యింది.
తర్వాత ఆదిరెడ్డి ఒక చిన్న యూట్యూబ్ ఛానల్ ని స్టార్ట్ చేసాడు. మొదటగా మూవీస్ కి రివ్యూ చేప్పేవాడు. ఆ తర్వాత సమాజంలో జరిగే ప్రస్తుత సంఘటనలు, క్రికెట్ రివ్యూస్ చేస్తు తనకంటూ ఒక మార్క్ ని సంపాందించుకున్నాడు. ఒక సాధారణ మధ్య తరగతి కుటుంబంలో పుట్టి, ఒక యూట్యూబ్ సెన్సేషన్ గా మారాడు. రివ్యూ ఎక్స్‌పర్ట్ గా పేరు తెచ్చుకున్నాడు.
కష్టాలను తన ఇంటిపేరుగా చెప్పుకునే అతను, తన జీవిత ప్రయాణంలో అనేక ఒడిదుడుకులను ఎదుర్కున్నాడంట. ఒక కామన్ మ్యాన్ గా బిగ్ బాస్ లోకి అడుగుపెట్టాడు. తను హౌస్ లోకి పదిహేడవ కంటెస్టెంట్ గా అడుగు పెట్టాడు. హౌస్ లో మొదటి వారం నుండి తనదైన శైలిలో ఆడుతూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నాడు. అంతేకాకుండా కెప్టెన్ కూడా అయి తన ఆట తీరు ఏంటో అభిమానులకు చూపించాడు. "ఒక కామన్ మ్యాన్, బిగ్ బాస్ రివ్యూయర్ అయ్యాడు. ఒక బిగ్ బాస్ రివ్యూయర్, కెప్టెన్ అయ్యాడు" అని నాగార్జున చెప్పాడు.
దీంతో ఆదిరెడ్డి హౌస్ లో తనకంటూ ఒక మార్క్ ని క్రియేట్ చేసుకొని అలరిస్తున్నాడు. అయితే హౌస్ లో ఎలాంటి గొడవలకి పోకుండా, ఎక్కువ ఆట మీద ఆసక్తితో ఆడుతున్నాడు. హౌస్ లో గీతుతో మాత్రం సన్నిహితంగా ఉంటూ రివ్యూస్ చేస్తున్నాడు. కాగా ఆదిరెడ్డి ఆట తీరును ప్రతీసారీ నాగ్ ప్రశంసిస్తూ వస్తున్నాడు. ఆదిరెడ్డి తన రివ్యూస్ లో ఎక్కువ ఉపయోగించే పదం'ఉడాల్'. ఈ పదం ఎక్కువగా పాపులర్ అయింది. కాగా నాగార్జున కూడా ఆదిరెడ్డిని 'ఉడాల్ మామ' అని పిలవడం విశేషం. ఆదిరెడ్డి ఇప్పటి వరకు బాగానే ఎంటర్టైన్మెంట్ చేసినా, ఇక మునుముందు ఏమైనా స్ట్రాటజీస్ ప్లాన్ చేసి, ఆడతాడో చూడాలి.
ఆదిరెడ్డి రెమ్యూనరేషన్ రోజుకి ముప్పై వేల నుండి ముప్ఫై అయిదు వేల వరకు ఉంటుందని బయట వినిపిస్తోంది. అయితే ఇక ముందు ఈ కామన్ మ్యాన్ షో ఎంతవరకు బిగ్ బాస్ లో కొనసాగుతుందో చూడాల్సి ఉంది.