English | Telugu

నామినేషన్లో ఆదిరెడ్డి మాస్ డైలాగ్స్!

సోమవారం బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. ఇందులో ఆదిరెడ్డి మాటలకు ఏ కంటెస్టెంట్ కూడా సరైన సమాధానం ఇవ్వలేకపోయారు. మాస్ రివ్యూస్ తో , బిగ్ బాస్ రూల్స్ చెబుతూ ఎవరిని కించపరచకుండా, అందరికి అర్థం అయ్యేలా చెప్తూ, తనదైన మాస్ డైలాగ్ లతో, ఒక స్పీచ్ లా ఒక్కొక్కరిని చాలా బాగా డిఫెండ్ చేసాడు. సరైన లాజిక్ లతో మిగిలిన హౌస్ మేట్స్ ని ఇరికించేసాడు.

నామినేషన్లో మొదటగా రోహిత్, ఆదిరెడ్డిని నామినేట్ చేసాడు. తర్వాత రీజన్ చెప్పాడు. "లాస్ట్ వీక్ ఎంటర్టైన్మెంట్ టాస్క్ లో మీది కొంచెం తగ్గినట్టు అనిపించింది. అందుకే నామినేట్ చేసాను" అని అనగానే, "మీరేం ఎంటర్టైన్మెంట్ చేసారు బ్రో" అని ఆదిరెడ్డి అన్నాడు. ఒక్క నిమిషం పాటు ఏం మాట్లాడాలో తనకి అర్థం కాలేదు. తర్వాత "నేను ఎంటర్టైన్మెంట్ చేసాను" అంటు కవర్ చేసుకున్నాడు.

తర్వాత మెరీనా నామినేట్ చేసింది ఆదిరెడ్డిని. "ఆ రోజు నేను సుదీప అంత కష్టపడుతున్నాం కిచెన్ లో, మీకేం అనిపించలేదా" అని మెరీనా చెప్పగా, "మీ ఇద్దరు ఆర్గుమెంట్ లో ఉన్నప్పుడు , మీదే తప్పు నాది తప్పు కాదు, అయినా మీరు తప్పు జరిగినప్పుడు చెప్పాలి. అప్పుడే ఆ రోజే చెప్పాల్సింది కదా" అని ఆదిరెడ్డి సమాధానమిచ్చాడు. అయితే మధ్యలో మెరీనా భర్త రోహిత్ సపోర్ట్ గా వచ్చి "మీరు ఆ పాయింట్ చెప్పారు. కాబట్టి మేం ఇది అడుగుతున్నాం" అని అనగానే, "మీరు ఇద్దరు కలిసి ఆడుతున్నారా? లేదు కదా? మరి మీకెందుకు? " అని ఆదిరెడ్డి చెప్పాడు. ఇది చూసిన హౌస్ మేట్స్ కి ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయింది.‌ఎవరికి అసలు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. "నా గేమ్ తక్కువ అని చెప్పడం నేను ఒప్పుకొను, మీరు అలా ఎలా అంటారు." అని మెరీనా అనగా, "ఇది నా ఒపీనియన్, నామినేషన్లో నేను కారణం చెబుతాను. దాన్ని మీరు తీసుకోవచ్చు. తీసుకోకపోవచ్చు. అది మీ పర్సనల్. కానీ నేను చెప్పాలనుకున్నది నేను చెబుతాను" అని ఆదిరెడ్డి అన్నాడు. ఆ తర్వాత వసంతి నామినేట్ చేసి, "మీ ఎంటర్టైన్మెంట్ కొంచెం తగ్గినట్టనిపించింది" అని ఆదిరెడ్డితో అనగా, ఎక్కడ తగ్గిందో చెప్పు అనేసాడు. దానికి వసంతి "డ్యాన్స్‌ తక్కువ అనిపించింది" అని అనగానే "పదా మనిమిద్దరం డ్యాన్స్ చేద్దాం" అని ఆదిరెడ్డి అన్నాడు.

దీంతో స్ట్రాంగ్ ఢిఫెండర్ అని మరోసారి నిరూపించుకొన్నాడు ఆదిరెడ్డి. చాలా ఉత్కంఠభరితంగా జరిగిన ఈ నామినేషన్లో ఆదిరెడ్డికి ఎక్కువ ఓట్లు వచ్చాయి. దీంతో ఆదిరెడ్డి ఈసారి నామినేషన్లో ఉన్నాడు. అయితే తన మార్క్ రివ్యూస్ తో, గేమ్ స్ట్రాటజీస్ తో ఎలా ఆడతాడో చూడాల్సి ఉంది.

Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.