English | Telugu

నా బుగ్గలు రియల్...సినిమాలో అలాంటి క్యారెక్టర్ వస్తే తప్పకుండా చేస్తా!


బ్రహ్మముడి సీరియల్ హీరోయిన్ దీపికా గురించి చెప్పాలంటే ఆమె వేసే పంచులు గురించి ఆమె నవ్వు గురించి చెప్పుకోవాలి. అన్ని షోస్ లోకి దీపికను స్పెషల్ గా తీసుకుంటూ ఉంటారు. ఆమె ఏ షోలో ఉంటె ఆ షో రేటింగ్ పెరుగుతుంది అని. ఎందుకంటే అక్కడ పంచ్ డైలాగ్స్ అలాగే విపరీతమైన ఫన్ క్రియేట్ చేస్తూ ఉంటుంది. బ్రహ్మముడిలో మానస్ కి భార్య రోల్ లో నటిస్తోంది. అలాగే ఈమె డాన్స్ ఐకాన్ 2 , చెఫ్ మంత్ర 2 లో చూస్తే ఈమె ప్రోమోస్ బాగా పడేవి. ఇక ఆదివారం విత్ స్టార్ మా పరివారం షోకి వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఢీ షోలో ఆదితో కలిసి ఎంజాయ్ చేస్తోంది. ఇప్పుడు ఈమె ఒక చిట్ చాట్ షోలో కొన్ని విషయాలు చెప్పింది. "నేను నా కెరీర్ ని తమిళ్ ఇండస్ట్రీలో న్యూస్ రీడర్ గా చేసాను.

నా న్యూస్ రీడింగ్ ని నా ఫేస్ ని చూసి నన్ను సీరియల్ హీరోయిన్ గా కమిట్ చేసేసారు. నా బుగ్గలు రియల్. నేను లవ్ చేసాను చేస్తున్నాను నా ప్రొఫెషన్ ని. నా నాలుకతో ముక్కును టచ్ చేస్తాను అదే నా హిడెన్ టాలెంట్. నాకు ఇందులో కూడా ఒక డౌట్ ఉంది. నా ముక్కు పొడవుగా ఉందా నా నాలుక పొడవుగా ఉందా అని. ఢీ సెట్ లో ఆది, పండు ఇద్దరూ బాగా ఫన్ చేస్తారు. ఏదైనా సినిమాలో నాకు యానిమల్ క్యారెక్టర్ వస్తే లేడీ టైగర్ కాబట్టి అలా చేస్తాను. కానీ అందరూ నేను క్యూట్ గా టెడ్డి బేర్ లా ఉంటాను అని చెప్తారు కాబట్టి టెడ్డి బేర్ క్యారెక్టర్ కూడా. ఢీ షో ఎక్స్పీరియన్స్ గురించి చెప్పాలంటే చాలా ఆనందంగా ఉంది. ఆ డాన్స్ షోని నేను ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాను. షోస్ , సీరియల్స్ అంటే ఇష్టం, లాంగ్ హెయిర్ ఇష్టం. హైదరాబాద్ అంటే ఇష్టం అలాగే లవ్ మ్యారేజ్ అన్నా కూడా. ట్రెడిషనల్ వేర్ వేసుకోవడం కాఫీ తాగడం ఇష్టం." అంటూ చెప్పుకొచ్చింది దీపికా రంగరాజు.

Jayam serial: వీరూ ప్లాన్ ని కనిపెట్టిన గంగ.. రుద్ర తెలుసుకుంటాడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -146 లో.... రుద్రకి ఎదురుగా గంగ వెళ్తుంది కానీ రుద్ర ఫోన్ మాట్లాడుతూ వెళ్ళిపోతాడు. కొంచెం దూరం వెళ్ళగానే రుద్రకి రింగ్ కనిపిస్తుంది. అది తీసుకొని చూస్తాడు. అప్పుడే ప్రమీల, ప్రీతీ వస్తారు. అన్నయ్య ఆ రింగ్ గంగ వదినది అని ప్రీతీ అంటుంది. ఈ రింగ్ ప్రపంచంలో ఆవిడకి ఒక్కదానికే ఉందా ఏంటని రుద్ర అంటాడు. ఆ తర్వాత అటుగా వెళ్తున్న గంగని రుద్ర పిలుస్తాడు. గంగ ముసుగులో ఉంటుంది. రుద్ర పిల్వగానే వస్తుంది. ఈ రింగ్ మీదేనా అని అడుగుతాడు. గంగ నాదేనని తీసుకుంటుంది..