English | Telugu

ఇంటరెస్ట్ ఉంటే ప్రాజెక్ట్ కే షోలో ఉండండి..లేదంటే వెళ్లిపోవచ్చు


చెఫ్ మంత్రం ప్రాజెక్ట్ కే ఎట్టకేలకు స్టార్ట్ అయ్యింది. ఇక ఈ షోకి 5 జోడీలు వచ్చాయి. ఇక అంబటి అర్జున్ - అమర్ దీప్ , యాదమ్మ రాజు - సుప్రీతా, దీపికా - సమీరా భరద్వాజ్, ప్రష్షు- ధరణి, విష్ణు ప్రియా - పృద్వి వచ్చారు. ఇక హోస్ట్ గా సుమ, చెఫ్ గా జీవన్ వచ్చారు. ఇక జీవన్ ఐతే ఫుల్ వీళ్లందరినీ భయపెట్టేసాడు. "జోక్స్ చాలా ఎంజాయ్ చేస్తాను..కానీ కుకింగ్ దగ్గరకు వచ్చేసరికి నేను చాలా సీరియస్ గా ఉంటాను. నేను ఎప్పుడు ఎవరిని ఏమంటానో తెలీదు..మీరు ఫీలవుతారా, బాధపడతారా నేను అస్సలు పట్టించుకోను.

ఇంటరెస్ట్ ఉంటే ఈ షోలో ఉండండి..లేదంటే వెళ్లిపోవచ్చు. ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్ మీరు చేసిన వంటలు నేను టేస్ట్ చేసాక మంచి స్కోర్ ఇవ్వడం జరుగుతుంది " అని చెప్పాడు. ఇక తర్వాత సుమ ఈ షో రూల్స్ చెప్పింది. ఈ సీజన్ లో 8 ఎపిసోడ్స్ ఉండబోతున్నాయి. ప్రతీ వారం చెఫ్ ఒక ప్రాజెక్ట్ ఇస్తారు అంటే ఒక వంటకం చేయమని టాస్క్ ఇస్తారు.. ఆ వంటకం ఎంత బాగా చేసి ఆయన్ని మెప్పిస్తారో దాని మీద స్కోర్స్ ఇస్తారు. ఒక్కొక్కళ్ళకి 100 కి ఎన్ని పాయింట్స్ ఐనా రావొచ్చు. ఇక 7 ఎపిసోడ్స్ ఐపోయాక ఎవరైతే టాప్ లీడింగ్ స్కోర్ లో ఉంటారో అందులోంచి ముగ్గుర్ని మాత్రమే సెలెక్ట్ చేసి గ్రాండ్ ఫినాలే ఆఫ్ చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కేలోకి ఎంటర్ అవుతారు. ఇక ప్రతీ వారం ఇచ్చే స్కోర్స్ కూడా నెక్స్ట్ వీక్ కి క్యారీ ఫార్వార్డ్ అవుతాయంటూ చెప్పింది సుమ.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.