English | Telugu
రష్మీ కన్నీటి వీడ్కోలు... కారణం వాళ్లేనా?
Updated : Oct 6, 2023
స్మాల్ స్క్రీన్ మీద జబర్దస్త్ కి, ఎక్స్ట్రా జబర్దస్త్ కి ఎంత పేరుందో అందరికీ తెలుసు. ఇక ఈ షోలో కనిపించే కమెడియన్స్ కి కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. వాళ్లకు కూడా ఫాన్స్ ఉన్నారు. ఒక విధంగా చెప్పాలంటే హీరోస్ కంటే వాళ్ళకే ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఫ్యాన్ పేజెస్ కూడా ఉన్నాయి. ఐతే ఇప్పటికే చాలామంది యాంకర్స్ జడ్జెస్ ఈ షోస్ నుంచి తప్పుకున్నారు. ఇకపోతే శుక్రవారం ఎక్స్ ట్రా జబర్దస్త్ కార్యక్రమానికి యాంకర్ రష్మీ హోస్ట్ గా చేస్తోంది.
ఐతే ఈ షో హోస్ట్ గా రష్మీ వెళ్ళిపోతున్నారంటూ ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఐతే ఆమె ఎందుకు వెళ్ళిపోవాలి అనుకుంటున్నారు అనే విషయం మీద నెటిజన్స్ ఆరా తీస్తున్నారు. ఈ షోకి కాస్త రేటింగ్ తగ్గేసరికి మల్లెమాల యాజమాన్యం రెమ్యూనరేషన్ విషయంలో కోతలు పెట్టేసరికి ఈ కార్యక్రమం నుంచి బయటకు రావాలని రష్మీ డిసైడ్ అయ్యారని సమాచారం. తనకు ఎంతో మంచి పేరు తీసుకు వచ్చిన ఈ షో నుంచి ఇలా వెళ్ళిపోవడం తనకు ఏ మాత్రం ఇష్టం లేకపోయినప్పటికీ తప్పనిసరి పరిస్థితిలో వెళ్ళిపోతుందట. ఈ షో ద్వారానే కాకుండ తాను నటించిన మూవీస్ ద్వారా కూడా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రష్మీ హోస్ట్ గా వేరే చానల్స్ లోకి ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయ్యారంటూ ఒక టాక్ వినిపిస్తోంది.
ఆల్రెడీ అనసూయ ఇప్పటికే స్మాల్ స్క్రీన్ కి బైబై చెప్పేసి బిగ్ స్క్రీన్ మీద ఆఫర్స్ మీద ఆఫర్స్ అందుకుంటోంది. పేరుకు పేరు, డబ్బుకు డబ్బు. మరి రష్మీ కూడా అనసూయ ట్రెండ్ ఫాలో అవుతున్నట్టే కనిపిస్తోంది..ఎందుకంటే అదే షో, అదే కామెడీ అంతా అదే అనేసరికి ఆడియన్స్ లో కూడా ఒక రకమైన మొనాటనీ వచ్చేస్తుంది. కాబట్టి రష్మీ కూడా తెలివిగా ఆలోచించి బిగ్ స్క్రీన్ మీద, వేరే ఛానెల్స్ లోకి వెళ్ళడానికి ట్రై చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఆల్రెడీ బలగం వేణు, సుడిగాలి సుధీర్, గెటప్ శీను ఇలాంటి వాళ్లంతా జబర్దస్త్ తో పాటుగా మిగతా చానెల్స్ లోను, మూవీస్ లోనూ మంచి పేరు తెచ్చుకున్న విషయం తెలిసింది.