English | Telugu
నయని ప్రయోగం ఫలించిందా?
Updated : Feb 16, 2022
బుల్లితెరపై ప్రసారం అవుతున్న సీరియల్ `త్రినయని`. జకగబోయేది ముందే గమనించే ఓ అమ్మాయి చుట్టూ జరిగే ఆసక్తికర సంఘటనల ఆధారంగా ఈ సీరియల్ ని రూపొందించారు. గత కొన్ని వారాలుగా ఈ సీరియల్ బుల్లితెర వీక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. కన్నడ నటీనటులు చందు గౌడ, అషిక గోపాల్ పడుకోన్ ప్రధాన జంటగా నటించారు. ఇతర ప్రధాన పాత్రల్లో అనిల్ చౌదరి, చల్లా చందు, నిహారిక, ప్రియాంక చౌదరి, విష్ణు ప్రియ, జయరామ్ పవిత్ర, శ్రీ సత్య, భావనా రెడ్డి నటించారు.
గత కొన్ని వారాలుగా చిత్ర విచిత్రమైన మలుపులతో ఈ సీరియల్ సాగుతోంది. ప్రమాదం కారణంగా కళ్లు పోగొట్టుకున్న విశాల్ కు మరో వ్యక్తి కళ్లని దానం చేయడం వాటిని విశాల్ కు పెడతారు. అప్పటి నుంచి గతం మర్చిపోయిన విశాల్ తన భార్య నయనని తప్ప అందరిని గుర్తుంచుకుంటాడు. దీంతో తన భర్తకు గతం గుర్తు చేయాలని నయన ప్రయత్నాలు చేస్తుంటుంది. ఈ క్రమంలో త్రినయనిలా మారి విశాల్ కు గతం గుర్తు చేయాలని ఏర్పాట్లు చేస్తుంది.
Also Read:యష్ - వేదల పెళ్లి .. మాళవికకు తెలిసిపోతుందా?
ఇది విశాల్ సవతి తల్లికి ఏ మాత్రం నచ్చదు. ఎక్కడ గతం గుర్తుకొస్తే తన జీవితం ముగిసిపోతుందోనని నయనని అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. అయినా నయనికి ఇంట సభ్యుల సహకారం లభించడంతో పుట్టిన రోజు అని అబద్ధం చెప్పి విశాల్ కు గతం గుర్తొచ్చే ప్రయత్నాలు చేస్తుంది. విశాల్ ని తొలిసారి కలిసిన సందర్భంలో ఎలాంటి వేషధారణతో వుందో మళ్లీ అదే వేషధారణతో రెడీ అయి వస్తుంది నయని. దీంతో ఏదో చేయబోతోందని విశాల్ స్టెప్ మదర్ భయపడుతూ వుంటుంది.
ఈ క్రమంలోనే విశాల్ తలపై కర్రతో కొడతుంది నయన. అది చూసి షాక్ అయిన విశాల్ తల్లి నయనని ఇంటి నుంచి తరిమేయాలని చూస్తుంది.. ఆ తరువాత ఏం జరిగింది? విశాల్ కు గతం గుర్తొచ్చిందా? .. నయని ప్రయోగం ఫలించిందా? అన్నది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.