English | Telugu
Suman Shetty Elimination: సుమన్ శెట్టి ఎలిమినేషన్.. కన్నీళ్ళతో బయటకు వచ్చాడుగా!
Updated : Dec 13, 2025
బిగ్ బాస్ సీజన్-9 లో పద్నాలుగో వారం వీకెండ్ వచ్చేసింది. ఇక అందరు ఎదురుచూస్తున్నట్టుగానే ఈ వీకెండ్ ఎపిసోడ్ అదిరిపోయింది. నాగార్జున గ్లామరెస్ గా రెడీ అయి వచ్చేశాడు. హౌస్ మేట్స్ అందరిని మాట్లాడించాడు.
ఈ వారం డబుల్ ఎలిమినేషన్ అనే విషయం ముందే చెప్పేశాడు. ఇక నామినేషన్లో ఉన్న ఆరుగురిలో ఒక్కొక్కరిని సేవ్ చేశాడు నాగార్జున. ఇక చివరి ఎలిమినేషన్ రౌండ్ కలర్ బోర్డ్ టాస్క్‌తో సుమన్ శెట్టిని ఎలిమినేట్ చేశాడు నాగార్జున. సుమన్ శెట్టి ఎలిమినేషన్ అనగానే అందరు షాక్ అయ్యారు. భరణి అయితే ఫుల్ ఎమోషనల్ అయ్యాడు. యూ ఆర్ ది బెస్ట్.. నీది మంచి మనస్సు.. నేను బయటకు రాగానే కచ్చితంగా మనం వర్క్ చేద్దామని మాటిచ్చాడు భరణి. ఇక ఇమ్మాన్యుయేల్, తనూజ, కళ్యాణ్, సంజన, డీమాన్ ఎమోషనల్ అయ్యారు. 'అధ్యక్షా వెళ్ళిపోతున్నా' అంటు బిగ్ బాస్ కి బై చెప్పేసి బయటకు వచ్చేశాడు. ఇక హౌస్ ని వీడి స్టేజ్ మీదకి వచ్చాడు నాగార్జున.
ఫైనల్ వీక్ ముందు ఎలిమినేట్ అయ్యావ్ కదా.. ఎలా ఉందని నాగార్జున అడుగగా.. హ్యాపీగానే ఉంది సర్.. ఒక్కవారం ఉంటే టాప్-5కి వెళ్లేవాడ్ని అని సుమన్ శెట్టి అన్నాడు. నేనూ అదే అనుకున్నా.. అరెరే సుమన్ వెళ్లిపోతున్నాడే అనిపించింది.. నీ ఆటతోనే కాదు.. మాటలతోనూ ఆకట్టుకున్నావ్... ఇప్పుడు నీ జర్నీ వీడియో సుమన్ శెట్టి ప్రభంజనం చూద్దామని చెప్పాడు.
అసలు బిగ్ బాస్ హౌస్‌ని వీడిన ఏ కంటెస్టెంట్‌కి దక్కని గుర్తింపు, గౌరవం సుమన్ శెట్టికి దక్కింది. సుమన్ శెట్టి తన ఆటతో ప్రభంజనం సృష్టించాడు అని నాగార్జున గర్వంగా, ఫుల్ ఎలివేషన్ ఇస్తూ చెప్పాడు. ఇప్పటివరకు ఏ కంటెస్టెంట్ కి ఇంతటి ఎలివేషన్ ఇవ్వలేదు. ఇక తన జర్నీ వీడియో చూసి ఎమోషనల్ అయ్యాడు సుమన్ శెట్టి.