English | Telugu

యామిని ప్లాన్ విని వైదేహీ షాక్.. రాజ్ ఏం చేయనున్నాడు!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -736 లో.... కావ్యకి రాజ్ ప్రపోజ్ చేయబోతుంటే.. అప్పుడే వైదేహి రాజ్ కి ఫోన్ చేసి యామిని కళ్ళు తిరిగి పడిపోయిందని చెప్తుంది. దాంతో రాజ్ ప్రపోజ్ చెయ్యకుండానీ వెళ్ళిపోతాడు. రాజ్ అలా వెళ్లిపోవడంతో కావ్యతో పాటు ఇంట్లో వాళ్ళందరూ డిస్సపాయింట్ అవుతారు. రాజ్ ఇంటికి వెళ్లి.. అసలు యామిని కి ఏమైందని అడుగుతాడు. డాక్టర్ యామినిని చెక్ చేసి రాజ్ ని బయటకు పిలిచి.. తను దేని గురించో టెన్షన్ పడుతుంది . స్ట్రెస్ తీసుకుంటుందని చెప్తాడు.

ఆ తర్వాత డాక్టర్ వెళ్ళాక రాజ్ వైదేహితో మాట్లాడతాడు. అసలు ఏమైందని అడుగుతాడు అంత నీ వల్లే అలా అయింది.. నువ్వు తనని పట్టించుకోవడం లేదు.. చిన్నప్పటి నుండి బావ నా భర్త అని ఎన్నో కలలు కంటుంది.. నువ్వు తనని పట్టించుకోవడం లేదని వైదేహి అంటుంది. నువ్వు నాకొక మాటివ్వు అంటూ రాజ్ తో మాట తీసుకుంటుంది. నువ్వు రెండు రోజులు యామినిని అలా బయటకు రెసాట్ కి తీసుకొని వెళ్ళమని రాజ్ తో యామిని వాళ్ళ అమ్మ అంటుంది. ఇక చేసేదేమీ లేక రాజ్ సరే అంటాడు. ఆ తర్వాత ప్లాన్ సక్సెస్ అంటూ యామిని తన పేరెంట్స్ హ్యాపీగా ఫీల్ అవుతారు. మరోవైపు ఇందిరాదేవి, అపర్ణ కలిసి కావ్య దగ్గరికి వచ్చి రాజ్ ప్రపోజ్ చెయ్యలేదని బాధపడుతుందనుకుంటారు. కానీ తను ఐస్ క్రీమ్ ఆర్డర్ చేసాను.. ఇంకా రావట్లేదని చెప్తుంది. ఆ తర్వాత ఇందిరాదేవి రాజ్ కి ఫోన్ చేసి.. రేపు అయినా వచ్చి కావ్యకి ప్రపోజ్ చెయ్ అని చెప్తుంది. లేదు రేపు యామినిని రెసాట్ కి తీసుకొని వెళ్తున్నానని రాజ్ చెప్తాడు.

రేపు రెసాట్ కి తీసుకొని వెళ్తున్నావ్ కానీ ఏం ప్లాన్ చేస్తున్నావని యామినిని వైదేహీ అడుగుతుంది. రేపు బావతో నా శోభనం.. అలా జరిగితే నన్ను బావ వదిలిపెట్టి వెళ్ళడు కదా అని యామిని అంటుంటే.. అలా ఎవరైనా చేస్తారా అని వైదేహి కోప్పడుతుంది. మరొకవైపు అప్పు, కళ్యాణ్ శోభనం గదిలో ఉంటారు. అప్పు దగ్గరికి కళ్యాణ్ వస్తుంటే.. అప్పు మాత్రం ఫోన్ చూస్తుంది. దాంతో కళ్యాణ్ ఫీల్ అవుతాడు. తరువాయి భాగంలో రాజ్ ని యామిని రెసాట్ కి తీసుకొని వెళ్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.