English | Telugu

Karthika Deepam2 : కార్తీక్ మాటలని అర్థం చేసుకున్న కాంచన.. శ్రీధర్ ని క్షమిస్తుందా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -515 లో.. తనకి అవమానం జరిగిందనే కోపంతో జ్యోత్స్న రగిలిపోతుంది. అప్పుడే పారిజాతం ఎంట్రీ ఇచ్చి భోజనం చేద్దాంరా అంటుంది. నాకు ఆకలిగా లేదని.. రానని జ్యోత్స్న చెప్తుంది. దీనంతటికి కారణం నీ చేతకానితనం అని పారిజాతం అంటుంది. ఒకవేళ ఆ దీప సీఈఓ అయి ఉంటే ఈ రోజు నా చేతిలో దాని పని అయి ఉండేదని పారిజాతం అంటుంది. అసలేం జరుగుతుంది.. అన్ని కనుక్కోవాలని జ్యోత్స్న అంటుంది.

మరొకవైపు కార్తీక్ కి దీప పాలు తీసుకొని వస్తుంది. లే బావ అని అంటుంది. కార్తీక్ కోపంగా నాకు ఏం అవసరం లేదని అంటాడు. నేను ఏం అన్నాను బావ.. అంత కోపం అని దీప అడుగుతుంది. మీ అమ్మనాన్న గొడవ పెట్టుకుంటే కలిపే వరకు నిద్ర పోలేదు.. నాక్కూడా మా అమ్మనాన్నని కలపాలని ఉంటుంది కదా అని కార్తీక్ అంటాడు. నిజమేనని దీప అంటుంది. నా మాట నిన్ను అంత హర్ట్ చేసి ఉంటే సారీ బావ అని దీప అంటుంది. నీకు తెలియాలని చెప్తున్నానంతే అని కార్తీక్ అంటాడు. వాళ్ళు దూరంగా ఉన్నా కూడా ఒకరికొకరు ఆలోచిస్తారని కార్తీక్ తన తల్లిదండ్రుల గురించి దీపతో చెప్తాడు. ఆ తర్వాత ఆయనకి ఫోన్ చేసి విష్ చెయ్యాలా వద్దా అని కాంచన ఆలోచిస్తుంది. మరొకవైపు కాంచన ఫోన్ కోసం శ్రీధర్ వెయిట్ చేస్తాడు. కాంచన చెయ్యకపోయేసరికి శ్రీధర్ ఫోన్ చేస్తాడు. నా ఫోన్ కోసమే వెయిట్ చేస్తున్నావా అని అడుగుతాడు. అదేం లేదని కాంచన అంటుంది నాకు ఫోన్ చేసి విష్ చెయ్యాలని అనిపించలేదా అని శ్రీధర్ బాధపడుతాడు. నేను ఎందుకు విష్ చెయ్యాలని అనుకుంటానని లోపల ప్రేమ ఉన్నా పైకి కాంచన లేనట్టు మాట్లాడుతుంది.

దాంతో శ్రీధర్ బాధపడుతాడు. కాంచన కఠినంగా మాట్లాడుతుంటే శ్రీధర్ ఎమోషనల్ అవుతాడు. అదంతా కార్తీక్ వింటాడు. ఫోన్ కట్ అయ్యాక కాంచన ఏడుస్తుంటే కార్తీక్ వస్తాడు. నాన్నని క్షమించొచ్చు కదా అన్నట్లుగా కార్తీక్ చెప్తాడు. నువ్వు ఎప్పుడు తల ఎత్తుకొని ఉండాలి అమ్మ అని కార్తీక్ చెప్పి వెళ్ళిపోతాడు. నాకు తెలుసురా నేను మీ నాన్నని క్షమించాలని కోరుకుంటున్నావ్ కానీ అది అసలు జరగదని కాంచన అనుకుటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.