English | Telugu

Brahmamudi : ఆస్తుల కోసం కోర్టుకి వెళ్తామన్న ఆ ఇద్దరు.. కుప్పకూలిన ఇంటిపెద్ద!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -595 లో.....దుగ్గిరాల ఇంటికి తమ దగ్గర పని చేసేవాళ్లు వస్తారు. ఎక్కడికి వస్తున్నారంటూ రుద్రాణి చిరాకుపడుతుంది. సీతారామయ్య గారు నా కొడుకు చదువుకి డబ్బులు ఇస్తున్నాడు. ఇప్పుడు డబ్బులు అవసరం అయ్యాయని వాళ్లు అనగానే.. ఇలా అందరికి ఇస్తూ పోతే మా పరిస్థితి ఏంటని రుద్రాణి తిట్టి పంపిస్తుంది. వాళ్లు బయట మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడే రాజ్ వచ్చి.. వాళ్ళ మాటలు విని లోపలికి వస్తాడు. ఏం జరిగిందని రుద్రాణిని రాజ్ అడుగుతాడు. మా తాతయ్య ఒకరికి మాటిచ్చారంటే తప్పడు.. ఆయన మాట నిలబెట్టే బాధ్యత నాది అంటూ కావ్యని డబ్బులు తీసుకొని రమ్మని చెప్తాడు.

ఆ తర్వాత ఇందిరాదేవి చేతులు మీదుగా వాళ్ళకి డబ్బులు ఇస్తుంది. తాతయ్య గారి మాట నిలబెట్టి సరైన వారసుడు అనిపించుకున్నారంటూ వాళ్లు రాజ్ గురించి గొప్పగా పొగుడుతారు. ఆ తర్వాత రాజ్ పై కోప్పడుతుంది రుద్రాణి. దాంతో అందరు రుద్రాణిని తిడతారు. నా భర్త కష్టం.. తన ఇష్టం వద్దనడానికి నువ్వెవవరంటూ రుద్రాణిపై ఇందిరాదేవి విరుచుకుపడుతుంది. కరెక్ట్ టైమ్ కి వచ్చి మీ తాతయ్య మాట నిలబెట్టావని ఇందిరాదేవి రాజ్ తో అంటుంది. మరొకవైపు కళ్యాణ్ కి అప్పు ఫోన్ చేసి మాట్లాడుతుంది కానీ సీతారామయ్య గురించి చెప్తే అప్పు బాధపడుతుందని కళ్యాణ్ చెప్పడు. నార్మల్ గా మాట్లాడతాడు. ఆ తర్వాత కావ్య దగ్గరికి సుభాష్ వచ్చి డబ్బులు తీసుకంటాడు. ఆ తర్వాత ప్రకాష్ వచ్చి డబ్బులు తీసుకుంటాడు. ఆ తర్వాత రాహుల్ తీసుకుంటాడు. ఇలా అందరు తీసుకుంటుంటే ఈ బాధ్యత నాకు వద్దని కావ్య అనుకోని రాజ్ దగ్గరికి వెళ్తుంది.

రాజ్ కి ఈ బాధ్యతలు వద్దని చెప్పాలి.. ముందు టీ ఇచ్చి మాట్లాడుతాననుకొని వెళ్తుంది కానీ రాజ్ చిరాకుపడేసరికి చెప్పకుండా వెళ్ళిపోతుంది. ఆ తర్వాత అపర్ణ దగ్గరికి వెళ్లి బాధ్యతలు వద్దని చెప్తుంది. కానీ అపర్ణ అందుకు ఒప్పుకోదు. తరువాయి భాగంలో సీతారామయ్య గారు షూరిటీ పెట్టారని బ్యాంక్ వాళ్లు చెప్పగానే అందరు తన భర్త మాటకి విలువ ఇవ్వాలని ఇందిరాదేవి అనగానే.. కుదరదు.. మా ఆస్తులు మాకు కావాలి..లేదంటే కోర్ట్ కి వెళ్తామని రుద్రాణి, ధాన్యలక్ష్మి అంటారు. అలా అనగానే ఆస్తుల కోసం కోర్ట్ కి వెళ్తారా అని ఇందిరాదేవి కిందపడిపోతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.