English | Telugu

Brahamamudi : నేనే తప్పు చేయలేదంటూ భార్య రిక్వెస్ట్.. అతను అంగీకరిస్తాడా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahamamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -535 లో.....అందరి గురించి బానే ఆలోచిస్తావ్ కానీ నీ కొడుకేం చేస్తున్నాడో పట్టించుకుంటున్నావా అని అపర్ణ అనగానే.. ఏం చేసాడు అంటీ అని స్వప్న అడుగుతుంది. ఎవరో అమ్మాయిని తీసుకొని షికారు చేస్తున్నాడని అనగానే రాహుల్ టెన్షన్ పడతాడు. ఆ తర్వాత బాగా చూసుకోమంటూ అపర్ణ, ఇందిరాదేవి లోపలికి వెళ్తారు. పద రాహుల్ గదిలోకి అని స్వప్న అంటుంది. నేను రానని రాహుల్ అనగానే.. అయితే ముసుగు వేసుకొని మరి కొడుతానని స్వప్న అనగానే.. అంటే నిన్న నైట్ కొట్టింది నువ్వేనా అని రుద్రాణి అంటుంది.

నేను కొడితే నువ్వు ఇలా ఉండేదానివి కాదని రాహుల్ ని గదిలోకి తీసుకొని వెళ్లి చితకబాదుతుంది స్వప్న. మరొకవైపు కావ్య దగ్గరికి అనామిక వస్తుంది. నిన్ను నా దగ్గర పని చేయమని రిక్వెస్ట్ చేయడానికి రాలేదు.. నువ్వు అగ్రిమెంట్ పై సంతకం పెట్టావ్.. అది తప్పితే కోర్టుల చుట్టూ తిరగాల్సి ఉంటుంది. నువ్వు రాకున్నా.. నాకు బెటరే.. నన్ను జైల్లో పెట్టించావ్.. నిన్ను పెట్టించే అవకాశం వచ్చిందని కావ్యకి అనామిక వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది. అది ఏం చేసిన దుగ్గిరాల కుటుంబానికి చెడు తలపెట్టే ఏ పని చెయ్యనని కావ్య అనుకుంటుంది. ఆ తర్వాత అప్పుని కళ్యాణ్ కోచింగ్ సెంటర్ లో జాయిన్ చేస్తాడు. ఆ తర్వాత సీతారామయ్య దగ్గరికి రాజ్ వస్తాడు. నువ్వు నీ భార్యపై కోపం తో బిజినెస్ మ్యాన్ అన్న విషయం మర్చిపోతున్నావ్ .. కావ్య లాంటి డిజైనర్ మన కంపెనీకి అవసరం.. వెంటనే డిజైనర్ గా అప్పాయింట్మెంట్ చెయ్ అని సీతారామయ్య చెప్తాడు.

మరొకవైపు అనామిక దగ్గరున్న అగ్రిమెంట్ కొట్టాయ్యడానికి కనకం మేడమ్ లాగా ఆఫీస్ కి వచ్చి.. కావ్య బాస్ ని మీ కంపెనీ లో ఎంప్లాయిస్ ని టార్చర్ పెడుతున్నారని కంప్లైంట్ వచ్చిందని చెప్తుంది. అందుకే అన్ని అగ్రిమెంట్ లు చెక్ చెయ్యాలని చెప్తుంది. తనతో ఇద్దరిని తీసుకొని వస్తుంది. వాళ్ళ సాయంతో కావ్య అగ్రిమెంట్ పేపర్ తీసుకుంటుంది. అప్పుడే అనామిక.. పిన్ని అంటూ వచ్చి మర్యాదగా ఆ అగ్రిమెంట్ పేపర్స్ ఇవ్వమని అంటుంది. తరువాయి భాగంలో రాజ్ ని కావ్య హగ్ చేసుకొని.. నేను ఏ తప్పు చెయ్యలేదు.. నన్ను అర్థం చేసుకోండని కావ్య అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu:పొదరిల్లు సీరియల్ లో సూపర్ ట్విస్ట్.. మహాలక్ష్మికి పెళ్ళి ఫిక్స్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -02 లో.....మహాలక్ష్మి ప్రాజెక్ట్ డిజైన్ రెడీ చేసి హాల్లోకి వస్తుంది. వాళ్ళ నాన్న ప్రతాప్ ఇంకా అన్నయ్య మహాలక్ష్మికి డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తారు. ఒకసారి చూడు మహా అని వాళ్ళ అన్నయ్య అంటాడు. నాకేం ఇప్పుడు పెళ్లి వద్దు అవసరం అయితే వదిన నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోండి అని మహా అంటుంది. ఇప్పుడు డిజైన్స్ చూపించడానికి వెళ్తున్నానని తెలిస్తే డాడీ వద్దని అంటాడనుకొని డాడీ కాలేజీలో సర్టిఫికెట్ ఉన్నాయి తెచ్చుకుంటానని చెప్తుంది.