English | Telugu

Brahmamudi : పంతం వదలని భర్త.. కన్నతల్లి కోసం భార్యని వదిలేసాడా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -514 లో.....మా అమ్మ అలా అవ్వడానికి కారణమైన వాళ్ళని వెనకేసుకొని వచ్చి రక్తసంబంధాన్ని పట్టించుకోవడం లేదని ఆ మనిషికి సపోర్ట్ చేస్తూ.. నన్ను తప్పు పడుతున్నవ్ అన్నదమ్ముల అనుబంధం తెంపుకునేలా మాట్లాడుతున్నావ్.. అవన్నీ వదిలేసి ప్రశాంతంగా వెళ్ళమని‌ కళ్యాణ్ తో రాజ్ అనగానే.. అలా వెళ్ళాలంటే నువ్వు వదినని తీసుకొని రావాలని కళ్యాణ్ అంటాడు. ఆ పని ఎప్పటికి చెయ్యను. తను తప్పు చేసానని ఫీల్ అయింది కాబట్టి వెళ్లిపోయింది. తప్పు చేయకుంటే గట్టిగా నిలబడి అడిగేదని రాజ్ అంటాడు.

వదిన తప్పు చేసిందని వెళ్ళలేదు నువు భర్తగా తనని అర్థం చేసుకోలేదు కాబట్టి వెళ్ళిపోయింది నమ్మాల్సిన విధంగా నమ్మలేదు కాబట్టి వదిలి వెళ్లిపోయింది. నేను తప్పు చెయ్యలేదు తీసుకొని వచ్చే పరిస్థితి లేదని రాజ్ అనగానే.. ఇంత బండారయిగా ఎలా మారావ్.. నువ్వు తప్పు చేసావని అనుకున్న రోజు సరిచేసే అవకాశం ఉండకపోవచ్చని చెప్పేసి కళ్యాణ్ వెళ్తుండగా.. ధాన్యలక్ష్మి ఆపి.. పరాయి ఇంటి నుండి వచ్చిన మీ వదినని అర్థం చేసుకున్నావ్.. ఈ తల్లిని ఎందుకు అర్థం చేసుకోకుండా అలాగే వెళ్ళిపోతున్నావని ధాన్యలక్ష్మి అంటుంది. వదిన వెళ్లిపోవడంలో నీ పాత్ర ఎంత అని కళ్యాణ్ అని వెళ్ళిపోతాడు. దాంతో అందరు షాక్ అవుతారు. ఆ తర్వాత ఇప్పటివరకు కళ్యాణ్ మాట్లాడితే ఎవరు ఎందుకు సమాధానం చెప్పలేదు. ఇన్ని రోజులు కావ్యని అర్ధం చేసుకున్నావ్.. అనుకున్నాను కానీ నా చెల్లిని వదిలేసేంత అర్థం చేసుకున్నావ్ అనుకోలేదని స్వప్న ఎమోషనల్ అవుతుంది. ఆ తర్వాత కావ్య వెళ్ళిపోయినందుకు రాహుల్ రుద్రాణి ఇద్దరు సాంగ్స్ పెట్టుకొని డాన్స్ చేస్తుంటారు. అప్పుడే స్వప్న వస్తుంది.

ఏంటి అంత హ్యాపీగా ఉన్నారు.. కొంపదీసి దీని అంతటికి కారణం మీరేనా అని స్వప్న అడుగుతుంది. మేం కాదని ఇద్దరు డైవర్ట్ చేస్తారు. ఆ తర్వాత కనకం ఇందిరదేవికి ఫోన్ చేసి.. అసలేం జరిగిందని అడుగుతుంది. నా మనవడిదే తప్పని ఇందిరాదేవి చెప్తుంది. ఆ తర్వాత కళ్యాణ్ బాధపడుతుంటే అప్పు దైర్యం చెప్తుంది. కాసేపటికి ఇందిరాదేవి రాజ్ దగ్గరికి వచ్చి కావ్యని ఇంటికి తీసుకొని రా అని చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu:పొదరిల్లు సీరియల్ లో సూపర్ ట్విస్ట్.. మహాలక్ష్మికి పెళ్ళి ఫిక్స్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -02 లో.....మహాలక్ష్మి ప్రాజెక్ట్ డిజైన్ రెడీ చేసి హాల్లోకి వస్తుంది. వాళ్ళ నాన్న ప్రతాప్ ఇంకా అన్నయ్య మహాలక్ష్మికి డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తారు. ఒకసారి చూడు మహా అని వాళ్ళ అన్నయ్య అంటాడు. నాకేం ఇప్పుడు పెళ్లి వద్దు అవసరం అయితే వదిన నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోండి అని మహా అంటుంది. ఇప్పుడు డిజైన్స్ చూపించడానికి వెళ్తున్నానని తెలిస్తే డాడీ వద్దని అంటాడనుకొని డాడీ కాలేజీలో సర్టిఫికెట్ ఉన్నాయి తెచ్చుకుంటానని చెప్తుంది.