English | Telugu

Brahmamudi : రాహుల్ వేసిన ప్లాన్ లో వాళ్ళు ఇరుక్కుంటారా.. అది నిజమైన బంగారమేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -501 లో.... అప్పు, కళ్యాణ్ లని ఇంటికి రమ్మని కృష్ణమూర్తి ఆహ్వానిస్తాడు. కానీ రాలేమని అప్పు చెప్తుంది. ఆ తర్వాత కనకం వెళ్ళిపోతు అప్పుకి మూడు వేయిలు ఇస్తుంది. వద్దని అప్పు అంటున్నా వినకుండా కనకం ఇచ్చి వెళ్తుంది. ఆ తర్వాత కనకం వాళ్లు బయటకు వచ్చాక.. ఇలా వచ్చి అలా వెళ్తున్నామని కృష్ణమూర్తి అనగానే.. ఉంటే ఏం పెడుకతారు.. పాపం వాళ్ళకి తినడానికి కూడా లేదు.. వాయినం ఇచ్చిన ప్రసాదం మనకి ఇచ్చిందని కనకం అనగానే.. కళ్యాణ్ జాబ్ చూసుకున్నాకా అదంతా ఏం ఉండదని కృష్ణమూర్తి అంటాడు.

ఆ తర్వాత ఈ డబ్బులతో సరుకులు తీసుకొని రా అని అప్పు అనగానే.. అవి నీకు ఇచ్చిన డబ్బులు.. వద్దని కళ్యాణ్ అంటాడు. ఏదైనా జాబ్ చూసుకోవాలని కళ్యాణ్ అంటాడు. మరొకవైపు కావ్య పై నుండి కిందకి వస్తుంటే.. రాజ్ క్యారం బోర్డు సెట్ చేసి రమ్మని పిలుస్తాడు. ఇంట్లో పని ఎవరు చెయ్యాలని కావ్య అనగానే.. ఈ రోజు నీకు రెస్ట్ పనిమనిషి చేస్తుందని రాజ్ అంటాడు. ఇద్దరు క్యారం ఆడుతుంటే ఇందిరాదేవి అపర్ణలు వచ్చి.. మేమ్ కూడా ఆడతామని అంటారు. రాజ్, ఇందిరాదేవి ఒకవైపు.. కావ్య, అపర్ణ లు ఒక వైపు ఉంటారు. అలా అందరు ఒక్కొక్కరుగా హాల్లోకి వస్తారు. అందరు సరదాగా నవ్వుకుంటా ఉంటారు. అప్పుడే ధాన్యలక్ష్మి, రుద్రాణిలు వస్తారు. వాళ్లు అలా ఉండడం చూసి.. చూసావా నీ కొడుకు ఇంట్లో నుండి వెళ్ళిపోయాడన్న బాధ ఒక్కరిలో కన్పించడం లేదని రుద్రాణి అనగానే.. నువ్వు కూడా రాత్రి చాలా నవ్వావు కదా అని ధాన్యలక్ష్మి అంటుంది. స్వప్న కావాలనే లాఫింగ్ గ్యాస్ వదిలింది.. అందుకేనని రుద్రాణి చెప్పగానే ఇదంత స్వప్న ప్లానా అని ధాన్యలక్ష్మి అంటుంది. నా కొడుకు వెళ్లిపోయిన వీళ్లకి అవసరం లేదు ఎలా హ్యాపీ గా ఉన్నారు వెళ్లి అడుగుతానంటూ ధాన్యలక్ష్మి వెళ్తుంటే.. ఇప్పుడే వద్దని రుద్రాణి ఆపుతుంది. మరొకవైపు రాహుల్ రుద్రాణిలు కావ్యపై అందరు కోప్పడాలిని ప్లాన్ చేస్తారు. రాహుల్ కావాలనే స్వప్నకి వినపడేలా.. ఈ ఇల్లీగల్ గోల్డ్ గురించి ఎవరికి తెలియదు.. ఇప్పుడు నేనే కంపెనీకి హెడ్ కాబట్టి అంతా చూసుకుంటానని అంటాడు.

ఆ తర్వాత ఆ మాటలు విన్న స్వప్న వెంటనే వెళ్లి కావ్యకి చెప్తుంది. గోల్డ్ మన కంపెని కొంటే కంపెనీకి నష్టం జరుగుతుంది కదా అని స్వప్న అంటుంది. అప్పుడు మనం అడ్డుకున్న కూడా.. ఇంకా ఆ బిజినెస్ పైనే ఉన్నాడా అని కావ్య అంటుంది. తరువాయి భాగంలో అదే విషయం అక్కాచెల్లెలు ఇంట్లో అందరికి చెప్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu:పొదరిల్లు సీరియల్ లో సూపర్ ట్విస్ట్.. మహాలక్ష్మికి పెళ్ళి ఫిక్స్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -02 లో.....మహాలక్ష్మి ప్రాజెక్ట్ డిజైన్ రెడీ చేసి హాల్లోకి వస్తుంది. వాళ్ళ నాన్న ప్రతాప్ ఇంకా అన్నయ్య మహాలక్ష్మికి డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తారు. ఒకసారి చూడు మహా అని వాళ్ళ అన్నయ్య అంటాడు. నాకేం ఇప్పుడు పెళ్లి వద్దు అవసరం అయితే వదిన నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోండి అని మహా అంటుంది. ఇప్పుడు డిజైన్స్ చూపించడానికి వెళ్తున్నానని తెలిస్తే డాడీ వద్దని అంటాడనుకొని డాడీ కాలేజీలో సర్టిఫికెట్ ఉన్నాయి తెచ్చుకుంటానని చెప్తుంది.