English | Telugu

శివాజీ ఒక్కడే ఫెయిర్ ప్లేయర్.. అతని అడుగుజాడల్లోనే పల్లవి ప్రశాంత్!

బిగ్ బాస్ హౌజ్ లో రోజుకో ట్విస్ట్ తో ఆసక్తికరంగా సాగుతుంది. శనివారం నాటి ఎపిసోడ్‌లో హోస్ట్ నాగార్జున కంటెస్టెంట్స్ ని బుజ్జగిస్తూ వాతపెట్టాడు. అయితే మన సీరియల్ బ్యాచ్ కి ఎంత చెప్పిన చెవిటోడి ముందు శంకం ఊదినట్టే అనిపిస్తుందనుకుంటా.. అందుకే నాగార్జున అంత స్పష్టంగా అన్ ఫెయిర్ గేమ్ ఆడుతున్నారని అన్నా కూడా స్ట్రాటజీ అని అన్నాడు ఆట సందీప్. పెద్దగా అరిచేసి సంచాలక్ నిర్ణయాన్ని మార్చేస్తున్నారు. ఫౌల్ గేమ్ ఆడుతున్నారని నాగార్జున అంటే.. కవర్ చేసుకోవడానికి ప్రయత్నించాడు ఆట సందీప్.

ఇక గురుశిష్యులు శివాజీ- ప్రశాంత్ ని ప్రశంసలతో ముచ్చెత్తాడు నాగార్జున. బిబి ఇంట్లో దొంగతనం టాస్క్ లో అనవసరమైన వస్తువులన్నీ తెచ్చారు. ఒక్క ‌శివాజీ మాత్రమే బిగ్ బాస్ చెప్పిన రూల్స్ ను అర్థం చేసుకొని ఆడుతున్నాడు. అతని అడుగుజాడల్లోనే పల్లవి ప్రశాంత్ నడుస్తున్నాడంటూ నాగార్జున అన్నాడు. ఇక బిగ్ బాస్ సీజన్-7 లో మొదటి కెప్టెన్ అయినందుకు కంగ్రాట్స్ రైతు బిడ్డ అని అభినందనలు తెలిపాడు నాగార్జున. ఫ్రూట్ నింజా టాస్క్ లో ఆట సందీప్ జ్యూస్ డబ్బాలో తొక్క వేశాడన్నా అని పల్లవి ప్రశాంత్ అంటే ఎందుకు వదిలెయ్ రా అని అన్నావని నాగార్జున అడుగగా.. ఏం చెప్పిన అమర్ దీప్ వినడు సర్. పల్లవి ప్రశాంత్ ను వాళ్ళు తక్కువ చేసి మాట్లాడుతున్నారని, నీతో ఎవరు కలవట్లేదని తన పక్కన ఉన్నా అని శివాజీ అన్నాడు.

ఇక హౌజ్ మొత్తంలో ప్రతీ టాస్క్ లో నీతిగా, నిజాయితీగా ఆడింది శివాజీ- పల్లవి ప్రశాంత్ అని చెప్పాడు నాగార్జున. ఇక రంగు పడుద్ది టాస్క్ లో ఆట సందీప్ సంఛాలక్ డెసిషన్ ని మార్చాడని, తనకోసం ప్రియాంక జైన్ నిర్ణయాన్ని మార్చుకుందని, అలా ఎప్పుడు చేయకూడదని నాగార్జున అన్నాడు. ఇలా ఒక్కో కంటెస్టెంట్ యొక్క తప్పొఒప్పొల్ని చెప్తూ హౌజ్ మొత్తంలో ఫెయిర్ గా ఆడిన బడ్డీ శివాజీ-ప్రశాంత్ అని నాగార్జున అందరికి చెప్పాడు. ఆ తర్వాత యావర్-టేస్టీ తేజలు కూడా బాగా ఆడారని అన్నాడు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.