English | Telugu
Brahmamudi Today Episode: దేవుడి దగ్గరికి వెళ్ళిన కావ్య... రాజ్ పోయి పాత స్వరాజ్ వచ్చాడు
Updated : Nov 3, 2023
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -244 లో.. స్వప్న తన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి, నిజం దాయడానికి కారణం కావ్య అని చెప్పగానే.. ఇంట్లో అందరు కావ్య మోసం చేసిందని అనుకుంటారు. ఆ తర్వాత స్వప్నని గదిలోకి తీసుకెళ్ళిన కావ్య.. ఎందుకు ఇలా చేసావని అడుగుతుంది. దానికి స్వప్న పొగరుగా సమాధానం చెప్తుంది. ఇంట్లో ఎవరైన నాకు వ్యతిరేకంగా ఉంటే మాత్రం నేను కచ్చితంగా వాళ్లని ఎదురిస్తానని స్వప్న చెప్తుంది.
ఆ తర్వాత నువ్వు తప్పు చేసావ్ కాబట్టి ఇక్కడ తల దించుకోని ఉండు లేదంటే నీ తప్పు లు మొత్తం బయటపెడతాను. ఇప్పుడు ఒక చెంపదెబ్బతో వదిలేసాను ఇక ముందు అలా ఉండదని స్వప్నకి కావ్య వార్నింగ్ ఇస్తుంది. మరొకవైపు స్వప్న చేసిన మోసాన్ని గుర్తుకు చేసుకొని కనకం, కృష్ణమూర్తి ఇద్దరు బాధపడుతుంటారు. స్వప్న స్వార్థంగా అలోచించి కావ్య జీవితంతో ఆడుకుంటుంది. ఇన్ని రోజులు కష్టం అయిన సరే ఇంట్లో వాళ్ళ మనసును గెలవడం కోసం కావ్య కష్టపడింది. స్వప్న ఆ ఇంట్లో ఉంటే కావ్యని సవ్యంగా సంసారం చేసుకోనివ్వదని కనకంతో కృష్ణమూర్తి అంటాడు. అవును స్వప్నని ఆ ఇంటికి దూరం చెయ్యాలని కనకం అనుకుంటుంది. మరొక వైపు రాజ్ కి తన తప్పేం లేదని కావ్య చెప్పే ప్రయత్నం చేస్తుంది. అయిన రాజ్ కావ్య మోసం చేసిందని అంటాడు. కావ్య మాత్రం జరిగింది మొత్తం చెప్తుంది. నిజాన్ని దాచడం నా దృష్టిలో మోసం చెయ్యడమని రాజ్ అనగానే మరి మీరు చేసిందేంటి? తాతయ్య గారి కోసం నా మీద ప్రేమ ఉన్నట్లు నటించలేదా అంటూ కావ్య తన బాధని చెప్తూ ఎమోషనల్ అవుతుంది. అయిన మళ్ళీ ఇదొక నాటకమా అంటూ రాజ్ అంటాడు. కానీ కావ్య చెప్పింది నమ్మడు. రాహుల్ కూడా మా అక్కని మోసం చేసాడు. అది మోసం కాదా? మా అక్క కాపురం బాగుండాలని ట్రై చేశాను కానీ ఎప్పటికప్పుడు మా అక్కకి నిజం చెప్పమని వార్నింగ్ ఇచ్చానని కావ్య చెప్పిన రాజ్ వినే స్థితిలో ఉండడు.
ఆ తర్వాత రాజ్ వెళ్లిపోతు.. తాతయ్య కోసం నటించే క్రమంలో అందరు మారిపోయావన్నారు. నేను నిజంగానే మారిపోయాను. కానీ నువ్వు ఇప్పుడు చేసిన మోసం వాల్ల నాలో రాజ్ పోయి పాత స్వరాజ్ బయటకు వచ్చాడు. ఇంకెప్పుడు మారే సిచువేషన్ ఉండదని చెప్పి కావ్యతో రాజ్ చెప్పి వెళ్ళిపోతాడు. మరొక వైపు కావ్య చేసిన మోసాన్ని గుర్తుకు చేసుకొని తిడుతు ఉంటుంది అపర్ణ. దాంతో తన అక్క కోసం అలా చేసిందని కావ్యకి సపోర్ట్ గా సుభాష్ మాట్లాడుతాడు. స్వప్న ప్రెగ్నెంట్ కాదని, పెళ్లి తర్వాత ఆ విషయం రాజ్ తో అయిన చెప్పాలి కదా అని సుభాష్ తో అపర్ణ అంటుంది.
మీ అక్కని తీసుకొని నీ అంతట నువ్వే వెళ్ళిపోతే చాలా మంచిదని కావ్యతో అపర్ణ అనగానే.. దేవుడి దగ్గరికి వెళ్ళి తన బాధని చెప్పుకుంటుంది కావ్య. అక్క తనని తాను కాపాడుకోవడానికి తను చేసిన మోసంలో నన్ను భాగం చేసిందని దేవుడితో కావ్య చెప్పుకుంటూ బాధపడుతుంది. కావ్య మాటలు విన్న రాజ్.. కావ్య తప్పేం లేదని, తన బాధని తెలుసుకోగలడా? తనని స్వప్న చేసిన మోసం నుండి బయటపడేయగలడా? తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.