English | Telugu

Bigg Boss 9 Telugu : కప్ కి దగ్గరగా కూతురు.. ఎగ్జిట్ కి దగ్గరగా నాన్న!

బిగ్ బాస్ సీజన్-9 లో ఇప్పటికే తొమ్మిది వారాలు గడిచిపోయింది. ఇక నిన్నటి ఎపిసోడ్ లో కంటెస్టెంట్స్ లో ఎవరు బాగా ఆడుతున్నారని, ఎవరు వీక్ గా ఉన్నారని అడుగుతూ ఓ టాస్క్ ఇచ్చాడు. అదేంటంటే గార్డెన్ ఏరియాలో అందరిని కూర్చోబెట్టి.. వారి ఫోటోలతో ఉన్న జెండాలని ఉంచాడు. ఇక అక్కడ ట్రోఫీ అండ్ ఎగ్జిట్ అని రెండు ఉంచాడు బిగ్ బాస్.

సాధారణంగా హౌస్ లో ప్రతీ సండే ఎపిసోడ్ ని సండే ఫండే అంటు స్టార్ట్ చేస్తాడు నాగార్జున. కానీ ఈ వీక్ సీరియస్ డిస్కషన్ తో సండే అలా గడిచిపోయింది. అదే విన్నర్ ఎవరు అని డిస్కషన్. గార్డెన్ ఏరియాలో లో ట్రోఫీ పెట్టి.. ట్రోఫికి ఎవరు దగ్గరున్నారు ఎగ్జిట్ కి ఎవరు దగ్గరున్నారని కంటెస్టెంట్స్ ని ఒక్కొక్కరిగా అడిగాడు నాగార్జున. అందులో సుమన్ ని మొదట పిలిచాడు. కప్ కి దగ్గరగా ఇమ్మాన్యుయల్, ఎగ్జిట్ కి దగ్గరగా భరణి ని పెడతాడు సుమన్ శెట్టి. ఇలా కంటెస్టెంట్స్ అందరు తమ పర్ స్పెక్టివ్ ప్రకారం పెడతారు. అయితే ఇందులో ఎక్కువ మంది ట్రోఫీకి దగ్గరగా ఇమ్మాన్యుయల్ ని సెకెండ్ తనూజకి ఎక్కువ మంది పెట్టారు. ఎగ్జిట్ కి దగ్గరగా అందరు సాయి అని పెట్టారు. సెకండ్ పోసిషన్ లో భరణిని పెట్టారు. భరణి అన్నకి సెకెండ్ ఛాన్స్ వచ్చిన ఉపయోగించుకోవడం లేదని అందరూ రీజన్ చెప్పారు. మొదటి నుండి నాన్న కూతురు బాండింగ్ ద్వారా భరణి గేమ్ లో వెనక్కి వెళ్ళాడు.. ఒక్కసారి ఎగ్జిట్ అయి మరొక ఛాన్స్ వచ్చింది. రీఎంట్రీ తర్వాత కూడా ఇద్దరు కూతుళ్ల మధ్య భరణి నలిగిపోతున్నాడు అటపై ఇంకా ఫోకస్ చెయ్యడం లేదు. ఎలిమినేషన్ రౌండ్ లో భరణి, సాయి ఉంటారు. నా కోసం నీ గోల్డెన్ బజర్ వాడుతావా అని తనూజని భరణి అడుగగా.. వేరొకరికి మాటిచ్చానని తనూజ చెప్పింది.

ఆల్రెడీ ప్రేక్షకులు టాప్-6 కంటెస్టెంట్స్ ఎవరో డిసైడ్ చేసారు. ఇప్పుడు ట్రోఫికి దగ్గరున్న వాళ్ళు కూడా వాళ్లే. ఇప్పుడు టాప్-5 కంటెస్టెంట్స్ ఎవరనేది అందరికి ఒక క్లారిటీ వచ్చింది. ఇమ్మాన్యుయల్, తనూజ, భరణి, కళ్యాణ్, డీమాన్ పవన్ టాప్ 5 కంటెస్టెంట్స్. ఈ సారి అయిన ఉమెన్ కంటెస్టెంట్ విన్నర్ అవుతుందో లేదో చూడాలి.

Podharillu:పొదరిల్లు సీరియల్ లో సూపర్ ట్విస్ట్.. మహాలక్ష్మికి పెళ్ళి ఫిక్స్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -02 లో.....మహాలక్ష్మి ప్రాజెక్ట్ డిజైన్ రెడీ చేసి హాల్లోకి వస్తుంది. వాళ్ళ నాన్న ప్రతాప్ ఇంకా అన్నయ్య మహాలక్ష్మికి డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తారు. ఒకసారి చూడు మహా అని వాళ్ళ అన్నయ్య అంటాడు. నాకేం ఇప్పుడు పెళ్లి వద్దు అవసరం అయితే వదిన నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోండి అని మహా అంటుంది. ఇప్పుడు డిజైన్స్ చూపించడానికి వెళ్తున్నానని తెలిస్తే డాడీ వద్దని అంటాడనుకొని డాడీ కాలేజీలో సర్టిఫికెట్ ఉన్నాయి తెచ్చుకుంటానని చెప్తుంది.