English | Telugu

Sai Srinivas Remuneration: సాయి శ్రీనివాస్ రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

బిగ్‌బాస్ సీజన్-9లో తొమ్మిదో వారం డబుల్ ఎలిమినేషన్ జరగింది. నిజానికి అసలు ఈ వారం సింగిల్ ఎలిమినేషనే ప్లాన్ చేశారు. కానీ ఊహించని విధంగా హౌస్ నుంచి రాము రాథోడ్ సెల్ఫ్ ఎలిమినేట్ అయ్యాడు. దీంతో మరో ఎలిమినేషన్ జరగుతుందా లేక రాముతో సరిపెడతారా అని అందరు అనుకున్నారు. కానీ బిగ్‌బాస్ టీమ్ మాత్రం డబుల్ ఎలిమినేషన్‌కే నిర్ణయం తీసుకుంది. దీంతో శనివారం ఎపిసోడ్‌లో రాము ఔట్ కాగా ఆదివారం ఎపిసోడ్‌లో సాయి శ్రీనివాస్ ఎలిమినేషన్ అయ్యాడు.

సాయి శ్రీనివాస్ బిగ్‌బాస్ హౌస్‌లో నాలుగు వారాలు ఉన్నాడు. ప్రతీ వారం రెండు లక్షల చొప్పున ఆయనకు మొత్తం ఎనిమిది లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇంకొక్క వారం ఉంటే నేనేమిటో చూపించేవాడిని అని సాయి బయటకు వచ్చిన తర్వాత చెప్పిన మాట ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సాయి శ్రీనివాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చాడు.‌ నామినేషన్ నుండి సేవ్ అయ్యే పవర్ తో హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన సాయి శ్రీనివాస్.. ‌తన కోసం రెండో వారం వాడుకున్నాడు సాయి శ్రీనివాస్.

సాయి శ్రీనివాస్ హౌస్ లోకి వెళ్లి అందరిని మొదటగా అబ్జర్వ్ చేశాడు.‌ కానీ ఒకరి గురించి మరొకరి దగ్గర చెప్పాడు. ఇలా అందరికి తెలిసింది. దాంతో అందరి దృష్టిలో బ్యాక్ బిచ్చింగ్ చేస్తాడనే ముద్ర సాయి శ్రీనివాస్ పై పడింది. టాస్క్‌లు, మైండ్ గేమ్, స్క్రీన్ స్పేస్ విషయంలోనూ అతను వెనుకబడిపోయాడు. ఇదే సమయంలో పలు విషయాల్లో తనది కన్నింగ్ మైండ్ సెట్ అని జనాల్లోకి సంకేతాలు రావడంతో ఓటింగ్‌పై ప్రభావం చూపింది. దాంతో సాయిని బయటకు పంపడమే కరెక్ట్ అని బిగ్‌బాస్ టీమ్ భావించింది. అయితే బిగ్‌బాస్ వల్ల శ్రీనివాస్ సాయికి పాపులారిటీ లభించిందని చెప్పొచ్చు. గతంలో పలు చిత్రాల్లో నటించినప్పటికీ ఇతని గురించి బయట జనాలకి తెలియదు.. ఎప్పుడైతే బిగ్‌బాస్‌లో అడుగుపెట్టాడో నాటి నుంచి ప్రేక్షకులకు నోటెడ్ అయ్యాడు. ఇకపై శ్రీనివాస్ నటించే సినిమాలకు ప్రేక్షకుల ఆదరణ దక్కే అవకాశం ఉంది.

Podharillu:పొదరిల్లు సీరియల్ లో సూపర్ ట్విస్ట్.. మహాలక్ష్మికి పెళ్ళి ఫిక్స్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -02 లో.....మహాలక్ష్మి ప్రాజెక్ట్ డిజైన్ రెడీ చేసి హాల్లోకి వస్తుంది. వాళ్ళ నాన్న ప్రతాప్ ఇంకా అన్నయ్య మహాలక్ష్మికి డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తారు. ఒకసారి చూడు మహా అని వాళ్ళ అన్నయ్య అంటాడు. నాకేం ఇప్పుడు పెళ్లి వద్దు అవసరం అయితే వదిన నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోండి అని మహా అంటుంది. ఇప్పుడు డిజైన్స్ చూపించడానికి వెళ్తున్నానని తెలిస్తే డాడీ వద్దని అంటాడనుకొని డాడీ కాలేజీలో సర్టిఫికెట్ ఉన్నాయి తెచ్చుకుంటానని చెప్తుంది.