English | Telugu
Ramu Rathod Remuneration: రాము రాథోడ్ రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
Updated : Nov 9, 2025
బిగ్ బాస్ హౌస్ లోకి సింగర్ గా అడుగుపెట్టిన రాము రాథోడ్ కి ఫ్యాన్ బేస్ గట్టిగానే ఉంది. ప్రతీ వారం అతను నామినేషన్లో ఉండగా అతనికి అత్యధిక ఓటింగ్ పడింది. అందులోను అతనికి ఎవరితో అంతగా గొడవలు లేవు. అయితే కంటెంట్ కూడా ఏం ఇవ్వకపోవడంతో అతనికి కాస్త ఓటింగ్ తగ్గింది.
రాము రాథోడ్ హౌస్ లో మొదటి నుండి భరణితో క్లోజ్ గా ఉండేవాడు. ఆ తర్వాత గౌరవ్ తో మాట్లాడేవాడు. అయితే గతవారం గౌరవ్ ని నామినేట్ చేశాడు రాము రాథోడ్. దాంతో వారిద్దరి మధ్య భేదాభిప్రాయాలు ఏర్పడ్డాయి. ఇక హౌస్ లో ఎంతమంది ఉన్నా ఒంటరిగా ఉన్నానంటూ రాము బయటకు వచ్చేముందు చెప్పాడు. రాము రాథోడ్ లో నిరుత్సాహం పెరగడం.. టాస్క్‌లలో మధ్యలోనే గివప్ చెప్పడం, నామినేషన్ల సమయంలో కూడా చాలా నీరసంగా వ్యవహరించడం వల్ల ప్రేక్షకుల్లో నెగెటివ్ ఇమేజ్ స్టార్ట్ అయ్యింది. అయితే రాము ఇలా ఉండటానికి కారణం లేకపోలేదు. గత కొన్నిరోజులుగా రాము తల్లిదండ్రులకు దూరంగా ఉండటం వల్ల , ఒంటరితనం, ఇంటి జ్ఞాపకాలతో హోమ్ సిక్ అయ్యాడు. ఈ కారణాలతోనే రాము సెల్ఫ్ ఎలిమినేట్ అయ్యాడు.
రాము రాథోడ్ హౌస్ లో తొమ్మిది వారాలున్నాడు. అతను ఉన్నన్ని రోజులకు గాను ప్రతీవారం సుమారు రెండు లక్షలు రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. అంటే మొత్తం మీద రాముకి పద్దెనిమిది లక్షల వరకు రెమ్యునరేషన్ లభించినట్లు సమాచారం. రాము సెల్ఫ్ ఎలిమినేషన్ ని కొందరు వ్యతిరేకిస్తుంటే మరికొందరు అతనికి సపోర్ట్ గా ఉంటున్నారు.