English | Telugu

Sai Srinivas Buzz : హౌస్ మొత్తం కట్టప్పలే .. నన్ను వెన్నుపోటు పొడిచారు..


బిగ్ బాస్ సీజన్-9 లో తొమ్మిదో వారం రాము రాథోడ్, సాయి శ్రీనివాస్ ఇద్దరు ఎలిమినేట్ అయి బయటకొచ్చేశారు. బిగ్ బాస్ హౌస్ లో ఓటింగ్ లో అందరి అంచనాల ప్రకారం ఈ వారం సాయి శ్రీనివాస్ ఎలిమినేట్ అయి బయటకు వచ్చాడు.

ఇక హౌస్ నుండి ఎలిమినేషన్ అయ్యాక బజ్ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు సాయి శ్రీనివాస్. అలా
సాయి రాగానే ఆహా సాయిరాం తృప్తిగా ఉంది నాయనా అని శివాజీ అన్నాడు. నువ్వు హౌస్‌లోకి వెళ్లిన తర్వాత నీకు పాజిటివ్ అయిందనుకుంటున్నావా.. నెగెటివ్ అయిందనుకుంటున్నావా అని శివాజీ అడిగాడు. నేను కనిపించీ కనిపించనట్లున్నాను కాబట్టి రెండూ 50-50 వేసుకోవచ్చు అని సాయి ఆన్సర్ ఇచ్చాడు. దీనికి అసలు ఏమీ కాలేదు నువ్వుంటే కదా అవ్వడానికి.. నీ అదృష్టం ఏంటంటే నువ్వు నెక్స్ట్ సీజన్‌కి కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు.. ఫ్రెష్ అనుకుంటారు ఎందుకంటే నువ్వు ఇక్కడ కనపడలేదు కదా అంటూ శివాజీ వెటకారంగా మాట్లాడాడు.

ఇక శివాజీ మరీ ఫైరింగ్‌గా ఉండటంతో సాయి కూల్ చేయడానికి ఒక బిస్కెట్ వేశాడు. ఎప్పుడైతే మీరు బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంటరై.. మీరు ఆడిన విధానం చూసి కానీ అంటూ సాయి ఏదో చెప్పబోయాడు. దీనికి నేను అందరికీ సోప్ వేస్తాను.. నువ్వు నాకు ఆముదం వేస్తున్నట్లుందంటూ శివాజీ కౌంటర్ వేశాడు. నేను పోరాడటానికి వచ్చాను ప్రాధేయపడటానికి రాలేదు అన్నావ్ కదా.. ఏం పోరాడావని నీకు అనిపించిందని శివాజీ అడుగగా.. తర్వాత స్క్రీన్ మీద బాహుబలిలో రాజమాత శివగామి ఫొటో చూపించాడు. ఇలా ఫీలయ్యేది తనూజ అని నా ఫీలింగ్ అంటూ సాయి అన్నాడు.

ఆ తర్వాత కట్టప్ప ఫొటో రాగానే కట్టప్పలు చాలా మంది ఉన్నారు.. హౌస్ మొత్తం కట్టప్పలే.. రీతూ ప్రస్తుతానికి నన్ను పొడిచింది నేను ఇక్కడున్నానని సాయి చెప్పాడు. దీనికి సీజన్-9 మొత్తం కట్టప్పలేనంటయ్యా సాయి చెప్తున్నాడు. అందరికన్నా ఎక్కువ కన్నింగ్ రీతూ అని సాయి శ్రీనివాస్ చెప్పాడు.‌ ఇలా హౌస్ లో అందరి గురించి తమ అభిప్రాయలు చెప్పుకొచ్చాడు సాయి శ్రీనివాస్.

Podharillu:పొదరిల్లు సీరియల్ లో సూపర్ ట్విస్ట్.. మహాలక్ష్మికి పెళ్ళి ఫిక్స్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -02 లో.....మహాలక్ష్మి ప్రాజెక్ట్ డిజైన్ రెడీ చేసి హాల్లోకి వస్తుంది. వాళ్ళ నాన్న ప్రతాప్ ఇంకా అన్నయ్య మహాలక్ష్మికి డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తారు. ఒకసారి చూడు మహా అని వాళ్ళ అన్నయ్య అంటాడు. నాకేం ఇప్పుడు పెళ్లి వద్దు అవసరం అయితే వదిన నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోండి అని మహా అంటుంది. ఇప్పుడు డిజైన్స్ చూపించడానికి వెళ్తున్నానని తెలిస్తే డాడీ వద్దని అంటాడనుకొని డాడీ కాలేజీలో సర్టిఫికెట్ ఉన్నాయి తెచ్చుకుంటానని చెప్తుంది.