English | Telugu
Flora saini Remuneration: ఫ్లోరా సైనీ రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
Updated : Oct 13, 2025
బిగ్ బాస్ సీజన్-9 లో అయిదో వారం ముగిసింది. ఇక ఈ అయిదో వారం డబుల్ ఎలిమినేషన్ అని కన్ఫమ్ అయింది. మొదటగా ఫ్లోరా సైనీని ఎలిమినేషన్ చేయగా సెకెండ్ శ్రీజని ఎలిమినేషన్ చేశారు. అయితే ఫ్లోరా సైనీ ఎలిమినేషన్ తో సంజన కాస్త ఎమోషనల్ అయింది.
హౌస్ లో ఉన్నన్ని రోజులు సంజనతో ఎక్కువగా ఉన్న ఫ్లోరా ఎలిమినేషన్ అవ్వగానే మిగతా హౌస్ మేట్స్ ఎవరు పెద్దగా పట్టించుకోలేదు. అయితే వీకెండ్ సండే ఎపిసోడ్ లో ఫన్ ఎలిమెంట్స్ ఉంటాయనుకున్నారంతా కానీ నామినేషన్లో ఉన్నవారిని సేవ్ చేసాడు నాగార్జున. ఇక రీతూ చౌదరి, ఫ్లోరా సైనీ నామినేషన్లో చివరగా ఉండగా.. హార్ట్ బీట్ చెక్ చేసే మిషన్ లు తీసుకొచ్చి ఎలిమినేషన్ ప్రక్రియని మొదలెట్టాడు నాగార్జున. ఇందులో ఫ్లోరా సైని లైఫ్ లైన్ ఆగిపోగా తను ఎలిమినేషన్ అయి స్టేజ్ మీదకి వచ్చేసింది. ఇక అక్కడ తన జర్నీ చూసి కాస్త ఎమోషనల్ అయింది. ఇక ఫ్లోరా రెమ్యునరేషన్ విషయానికొస్తే.. వారానికి రూ.2.1 లక్షల చొప్పున డీల్ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అయిదు వారాలు ఉన్నందుకు గానూ రూ.10.5 లక్షల పారితోషికం అందుకున్నట్లు తెలుస్తోంది. ఇన్నిరోజులు ఉన్నప్పటికి పెద్దగా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయినప్పటికీ.. రెమ్యునరేషన్ పరంగా బాగానే సంపాదించినట్లు కనిపిస్తుంది.
ఇక వెళ్తూ వెళ్తూ హౌస్ లో ఉన్నవారికి థమ్స్ అప్, థమ్స్ డౌన్ ఎవరో చెప్పమంటూ ఫ్లోరాని నాగార్జున అడిగాడు. దాంతో సంజన, దివ్య, ఇమ్మాన్యుయేల్, శ్రీజకి థమ్ అప్ ఇచ్చింది. భరణి, తనూజకి థమ్స్ డౌన్ ఇచ్చింది. సుమన్ శెట్టిని మాత్రం అటు ఇటుకి మధ్యలో పెట్టింది.