English | Telugu
Biggboss 8 Telugu contestant Aditya Om : బిగ్ బాస్ కి ఆదిత్య ఓమ్ కన్ఫమ్!
Updated : Aug 29, 2024
బిగ్ బాస్ సీజన్ 8 మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది. దీంతో కొంత మంది పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. వారిలో హీరో ఆదిత్య ఓమ్(Aditya Om) కూడా ఒకరు.
ఆదిత్య ఓమ్ ' లాహిరి లాహిరి లాహిరిలో ' సినిమాతో తెరంగేట్రం చేశాడు. ఆ తర్వాత ధనలక్ష్మి ఐ లవ్ యూ, ఒట్టు ఈ అమ్మాయి ఎవరో తెలియదు, మిస్టర్ లోన్లీ మిస్ లవ్లీ , మీ ఇంటికొస్తే ఏం ఇస్తారు మా ఇంటికొస్తే ఏం తెస్తారు లాంటి సినిమాలని ఆదిత్య చేశాడు. అయితే బంధూక్ సినిమాతో హిందీలోకి అరంగేట్రం చేశాడు ఆదిత్య. ఈ సినిమాకి దర్శకుడిగా హీరోగా చేసిన అదిత్య పలు సినిమాలు చేశాడు. ఇక మళ్ళీ తెలుగులోకి దహనం, అమరం, నాతో నేను, ఎర్ర గుడి లాంటి చిన్న సినిమాలల్లో నటించినా పెద్దగా హిట్ పొందలేకపోయాడు.
ఇక ఇప్పుడు కాస్త బ్రేక్ కోసం ఆదిత్య ఓమ్ చూస్తున్నాడు. బిబి టీమ్ అతడిని అప్రోచ్ అయినట్టు తెలుస్తుంది. దాంతో అతను మరోసారి తెలుగు ప్రేక్షకులకి దగ్గరవ్వొచ్చనే ఉద్దేశంతో ఒకే చెప్పినట్టు తెలుస్తోంది. అయితే ఆదిత్య బిగ్ బాస్ సీజన్-8 కి కన్ఫమ్ గా వస్తున్నాడనే వార్త నెట్టింట వైరల్ గా మారింది.