English | Telugu

నబీల్ వన్ మ్యాన్ షో.. అటు హౌస్ మేట్స్, ఇటు ఆడియన్స్ ఫిధా!

బిగ్ బాస్ హౌస్ లో ఎవరి ఊహకి అందకుండా కంటెస్టెంట్స్ తమ పర్ఫామెన్స్ ఇస్తున్నారు. రోజులు గడిచేకొద్దీ ఒక్కో కంటెస్టెంట్ యొక్క నేచర్ బయటకొస్తుంది‌.‌ మొదట్లో గంభీరంగా, స్టిక్ట్ గా ఉన్న నిఖిల్ ఇప్పుడు సోనియా మాయలో పడిపోయాడు.

ఇక ఫస్ట్ టూ వీక్స్ అసలు నబీల్ ఉన్నాడో లేదా అనిపించింది కానీ ఎప్పుడైతే తనలో ఫైర్ లేదని , వాయిస్ వినిపించడం లేదని నామినేషన్ లో అన్నారో.. అప్పటి నుంటి నెక్స్ట్ లెవెల్ ఆడుతున్నాడు. ఇక నిన్న జరిగిన ఎపిసోడ్‌ లో నబీల్ హవా కొనసాగింది. బిగ్‌బాస్ గోల్డెన్ బ్యాండ్ అంటూ ఓ స్పెషల్ ఐటెమ్‌ను కంటెస్టెంట్లకి చూపించాడు. దానికి స్పెషల్ పవర్స్ ఉంటాయని చెప్పినా సరే కంటెస్టెంట్లు ఎవరూ తీసుకోలేదు. కానీ మణికంఠ మాత్రం తెలివిగా దాన్ని అందుకున్నాడు. అయితే మణికంఠ తీసుకున్న తర్వాతే దాని పవర్ ఏంటో అందరికీ అర్థమైంది. ఆ గోల్డెన్ బ్యాండ్‌తో ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు బిగ్‌బాస్. ఇక ఆ తర్వాత కంటెస్టెంట్లు అందరూ వేరే సభ్యుల్ని ఇమిటేట్ చేస్తూ నటించమని చెప్పాడు. ఇందులో అందరికంటే నబీల్ మాత్రం ఇరగదీశాడు. ఆదిత్యను అద్భుతంగా ఇమిటేట్ చేశాడు.

ఇక పృథ్వీ, విష్ణుప్రియ లాగా నిఖిల్ అండ్ కిర్రాక్ సీత నటించారు. అలాగే మణికంఠ లాగా ప్రేరణ చక్కగా చేసింది. ఇక హౌస్ లో ఓ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. కొన్ని సౌండ్స్ వినిపిస్తాయి వాటిని ఇరు టీమ్ లు గెస్ చేసి ఆర్డర్ లో రాయాలి. అందులో శక్తి టీమ్ కు రెండు పాయింట్లు, కాంతారా టీమ్ కి ఒక్క పాయింట్ వచ్చింది‌. ఇక ఈ టాస్క్ కి సంఛాలక్ గా నబీల్ ఉన్నాడు. ఇక‌ నిన్నటి ఎపిసోడ్ లో నబీల్ ది వన్ మ్యాన్ షో అని చెప్పాలి.

Podharillu:పొదరిల్లు సీరియల్ లో సూపర్ ట్విస్ట్.. మహాలక్ష్మికి పెళ్ళి ఫిక్స్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -02 లో.....మహాలక్ష్మి ప్రాజెక్ట్ డిజైన్ రెడీ చేసి హాల్లోకి వస్తుంది. వాళ్ళ నాన్న ప్రతాప్ ఇంకా అన్నయ్య మహాలక్ష్మికి డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తారు. ఒకసారి చూడు మహా అని వాళ్ళ అన్నయ్య అంటాడు. నాకేం ఇప్పుడు పెళ్లి వద్దు అవసరం అయితే వదిన నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోండి అని మహా అంటుంది. ఇప్పుడు డిజైన్స్ చూపించడానికి వెళ్తున్నానని తెలిస్తే డాడీ వద్దని అంటాడనుకొని డాడీ కాలేజీలో సర్టిఫికెట్ ఉన్నాయి తెచ్చుకుంటానని చెప్తుంది.