English | Telugu
Bigg Boss Season 8: బిగ్‌బాస్ 8 ఫైనల్ లిస్ట్.. కామన్ మ్యాన్ ఎవరంటే!
Updated : Aug 30, 2024
తెలుగు బిగ్ బాస్ సీజన్ 8. మరో రెండు రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ తరుణంలో హౌస్ లోకి ఎవరెవరు వెళ్తారా అనే క్యూరియాసిటి అందరిలో నెలకొంది. ఇక రివ్యూలు, ఫ్యాన్ పేజీలు కంటెస్టెంట్స్ లిస్ట్ లు ఎవరికి వారే ఇస్తున్నారు. వీరిలో ఎవరు కన్ఫమ్? ఎవరు కాదనేది సండే రోజే తెలుస్తుంది. ఎందుకంటే చివరి నిమిషం వరకు హౌస్ లోకి ఎవరు వెళ్తారనేది ఉత్కంఠభరితంగానే ఉంటుంది.
ఇక బిగ్ బాస్ కంటెస్టెంట్స్ లిస్ట్ ఇప్పటికే యూట్యూబ్, ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్ లలో చాలామంది చెప్పేశారు. ఇక హౌస్ లోకి ఎవరు వెళ్తారనేది ఓసారి చూసేద్దాం. ఆదిత్య ఓం, నిఖిల్ మళియక్కల్, అంజలి పవన్, యష్మీ గౌడ, అభయ్ నవీన్, యాంకర్ విష్ణుప్రియ, అభిరామ్ వర్మ, కిర్రాక్ సీత, ఖయ్యూం అలీ, నాగ మణికంఠ, సోషల్ మీడియాలో ఇన్ ఫ్లూయన్సర్ బెజవాడ బేబక్క , రాజ్ తరుణ్-లావణ్య కేసుతో సంచలనంగా మారిన ఆర్జే శేఖర్ భాషా, సాహర్ కృష్ణన్, కళ్యాణి, విస్మయశ్రీ, నైనిక అనసురు, సోనియా ఆకుల ఉన్నారంటూ ప్రచారం జరుగుతుంది.
గత బిగ్ బాస్ సీజన్ 7 ఎంత పెద్ద హిట్ అయ్యిందో చెప్పనవసరం లేదు. కామన్ మ్యాన్ గా వచ్చిన రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ కి జనాలు విశేషంగా ఆదరించడంతో దానికి అంతటి క్రేజ్ వచ్చింది. నామినేషన్స్ లో పల్లవి ప్రశాంత్ ఉంటే అత్యధిక ఓటింగ్ లభించేది. అది కూడా అర్బన్, రూరల్ రెండు ఓటింగ్స్ గట్టిగానే వచ్చాయి. బిగ్ బాస్ ఆల్ టైమ్ రికార్ట్స్ లో విలేజ్ నుండి మిస్ డ్ కాల్స్ అత్యధికంగా వచ్చిన ఏకైక కంటెస్టెంట్ పల్లవి ప్రశాంత్. మరి ఇప్పుడు అలాంటి కామన్ మ్యాన్ కేటగిరీలో ఎవరు వస్తారనే క్యూరియాసిటి అందరిలో నెలకొంది.