English | Telugu

BB Transport Task లో గెలిచిందెవరు?


ప్రేక్షకులకు వినోదాన్ని పంచడంలో బిగ్ బాస్ ఎప్పుడూ ముందు ఉంటాడు. అలాంటిది టాస్క్ ల విషయంలో ఇంకా జాగ్రత్తగా ఉంటాడు. ఈ టాస్క్ లు ఎలా ఉంటాయంటే మిత్రులుగా ఉన్నవాళ్ళు, శత్రువులు అవుతారు. ఇప్పటికే దూరంగా ఉన్నవాళ్ళు ఇంకా దూరం అవుతారు. అయితే బిగ్ బాస్ హౌస్ లో నిన్న జరిగిన ఎపిసోడ్‌లో ఒక కొత్త టాస్క్ మొదలైంది. అదే 'BB Transport Task'.

ఈ టాస్క్ ఏంటంటే, "గార్డెన్ ఏరియాలో ఒక 'బిబి ట్రాన్స్ పోర్ట్' వాహనం ఉంది. ఒక్కో స్టాప్ కి మొదట ఎవరు ఎక్కి హారన్ కొడతారో? వారే కెప్టెన్సీ కంటెండర్ పోటీకి అర్హతను సాధిస్తారు. అందులో ఓడినవారు.. ఒక్కో సభ్యుడు ఇద్దరు చొప్పున సభ్యులను ఎన్నుకొని వారిని ఈ గేమ్ లో నుండి తొలగించాలి. ఆ తర్వాత ఉన్నవాళ్ళు ఈ గేమ్ ని కొనసాగిస్తారు" అని బిగ్ బాస్ చెప్పాడు.

అయితే ఈ టాస్క్ లో అదిరిపోయే ట్విస్ట్ లు ఉన్నాయి. బిగ్ బాస్ ప్రతీ రౌండ్ కి ఒక అమౌంట్ ను ఫిక్స్ చేసాడు. ఈ అమౌంట్ అనేది విన్నర్ ప్రైజ్ మనీ నుండి కోత విధించబడుతుంది. ఆ తర్వాత గేమ్ లో ఓడినవాళ్ళు ఒక్కొక్కరుగా సెలెక్ట్ చేసుకుంటూ వచ్చారు. రాజ్ ని ఇనయా సెలెక్ట్ చేసి తనని కెప్టెన్ పోటీ నుండి తొలగించగా, ఫైమా కూడా అదే తరహాలో తొలగిపోయింది‌. ఇక రేపు జరుగబోయే చివరిదైన కెప్టెన్సీ పోటీలో పాల్గొనడానికి రంగం సిద్ధమైంది. కాగా ఈ 'బిబి ట్రాన్స్ పోర్ట్' టాస్క్ లో విజేతలుగా నిలిచింది అయిదుగురు మాత్రమే. 'శ్రీహాన్, రేవంత్, ఆదిరెడ్డి, రోహిత్, ఇనయా' కెప్టెన్సీ పోటీకి అర్హతను సాధించారు. అయితే ఈ పోటీలో గెలిచేదెవరో? కెప్టెన్ అయ్యేదెవరో? చూడాలి మరి!

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.

Karthika Deepam2 : దాస్ ని నిజం చెప్పకుండా ఆపిన కార్తీక్.. దీప ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -566 లో.. జ్యోత్స్న గురించి శివన్నారాయణకి దాస్ నిజం చెప్పాలని అనుకుంటాడు. జ్యోత్స్న, పారిజాతం టెన్షన్ పడుతారు. దాస్ ని జ్యోత్స్న  కొట్టిన విషయం చెప్తాడు కావచ్చని దశరథ్ అనుకుంటాడు. జ్యోత్స్న గురించి ఇప్పుడే నిజం తెలియొద్దని దాస్ ని ఆపాలని కార్తీక్ ట్రై చేస్తాడు.. దాస్ నిజం చెప్పబోతుంటే ఒకవైపు దశరథ్.. ఒకవైపు కార్తీక్.. ఒకేసారి దాస్ ని ఆగమంటారు. దాస్ ఏదో ..చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావ్ పక్కకిరా.. నాతో చెప్పమని దశరథ్ అంటాడు.