English | Telugu
బిగ్ బాస్ హౌజ్ లో సండే రోజు ఏం జరిగిందో తెలుసా?
Updated : Sep 10, 2023
బిగ్ బాస్ ఇప్పటికే ఆరు సీజన్లు పూర్తి చేసుకొని ఇప్పుడు ఏడవ సీజన్ లోకి అడుగుపెట్ఠింది. హౌజ్ లోకి మొత్తం పద్నాలుగు మంది కంటెస్టెంట్స్ వెళ్ళారు. కాగా సోమవారం నుండి శుక్రవారం వరకు ఒక లెక్క, వీకెండ్ మరో లెక్క ఉంటుంది. ఉల్టా పల్టా థీమ్ తో సాగే ఈ సీజన్-7 ప్రేక్షకులకు సరికొత్త టాస్క్ లతో పాటు కొత్త రూల్స్ ని పరిచయం చేస్తూ ఇంట్రస్ట్ గా సాగుతుంది.
హోస్ట్ నాగార్జున ఆదివారం రోజు గ్రాంఢ్ గా రెడీ అయి వచ్చాడు. ఇక రాగానే ఎలిమినేషన్ లో ఉన్నవాళ్ళని నిల్చోమని చెప్పి ఒకరిని సేవ్ చేయాలని చెప్పాడు నాగార్జున. కాగా బాక్స్ లు తీసుకొచ్చి పుర్రె బొమ్మ ఉంటే అన్ సేఫ్, పూలు వస్తే సేఫ్ అని నాగార్జున చెప్పగా.. రతిక దగ్గర ఉన్న బాక్స్ లో పూలు వచ్చాయి కాబట్టి తను సేఫ్ అయింది. ఇక ఆ తర్వాత క్రాస్ సింబల్ హార్ట్ సింబల్ ఉన్న బాక్స్ తీసుకున్నారంత. అందులో గౌతమ్ కృష్ణ, పల్లవి ప్రశాంత్ సేఫ్ అయ్యారు. ఇలా ఒక్కొక్కరుగా సేఫ్ అవుతూ వచ్చారు.
అయితే మధ్యలో కొన్ని గేమ్స్ అండ్ టాస్క్ ఆడించాడు నాగార్జున. బెస్ట్ మూమెంట్ ఏంటి? మర్చిపోవాలనుకున్న మూమెంట్ ఏంటని ఒక్కో కంటెస్టెంట్ ని అడిగి తెలుసుకున్నారు నాగార్జున. అమర్ దీప్ వచ్చి టేస్టీ తేజ గురించి చెప్పాడు. హార్ట్ బ్రేక్ టాస్క్ లో అలా ఇద్దరి మధ్యలోకి వీళ్ళి సీక్రెట్ టాస్క్ ఆడాడని, అలా చేశాడని అది మర్చిపోవాలనుకున్న మూమెంట్ అని టేస్టీ తేజతో అమర్ దీప్ చెప్పాడు. ఆ తర్వాత శుభశ్రీ వచ్చి తన అభిప్రాయం చెప్పింది. అమర్ దీప్ తనకి తినిపించాడని, అమ్మ నాన్నల తర్వాత తనకి తినిపించిన మొదటి వ్యక్తి అమర్ దీప్ అని అది హౌజ్ లో తన బెస్ట్ మూమెంట్ అని శుభశ్రీ చెప్పింది. మర్చిపోవాలనుకున్న మూమెంట్ శోభా శెట్టితో జరిగిందని తనతో కనెక్షన్ పోయిందని శుభశ్రీ అంది. ఆ తర్వాత ప్రియాంక జైన్ వచ్చి దామిణి తనకి బెస్ట్ మూమెంట్ ఇచ్చిందని, ఆ తర్వాత మర్చిపోవాలనుకున్న మూమెంట్ కూడా తనే ఇచ్చిందని చెప్పింది. పల్లవి ప్రశాంత్ వచ్చి యాక్టర్ శివాజీ తనకి బెస్ట్ మూమెంట్ ఇచ్చాడని , షకీల మర్చిపోవాలనుకున్న మూమెంట్ ఇచ్చిందని చెప్పాడు. ఇలా ఒక్కొక్కరు వచ్చి హౌజ్ లో వారికి మిగతా కంటెస్టెంట్స్ తో ఉన్న బెస్ట్ అండ్ మర్చిపోవాలనుకున్న మూమెంట్స్ చెప్పారు.