English | Telugu

Wild cards Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ లోకి వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చేది వీళ్ళే!

బిగ్ బాస్ సీజన్-9 మొదలై నాలుగు వారాలు కంప్లీట్ అయి అయిదో వారంలోకి అడుగుపెట్టింది. ఈ నాలుగు వారాల్లో ప్రతీరోజు ఏదో ఒక కొత్తదనం కన్పిస్తుంది. అయితే ఇది పెద్దగా హిట్ అవ్వాలని భావించిన బిగ్ బాస్.‌. హౌస్ మేట్స్ కి షాక్ ఇచ్చాడు. వైల్డ్ కార్డు ఎంట్రీ ఉండబోతుందని నిన్నటి(సోమవారం) ఎపిసోడ్ చివర్లో బిగ్ బాస్ చెప్తాడు. అయితే వైల్డ్ కార్డ్ గురించి బయట నెట్టింట రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు.

బిగ్‌బాస్ 2.0లో భాగంగా మరో ఐదుగుర్ని హౌస్‌లోకి పంపించబోతున్నాడు బిగ్ బాస్. ఐదవ వారం చివర్లో ఈ ప్రాసెస్ జరగనుంది. ఇప్పటికే రమ్య మోక్ష (అలేఖ్య చిట్టి పికిల్స్), దివ్వెల మాధురి (కేరాఫ్ దువ్వాడ శ్రీనివాస్), సుహాసిని (దేవత సీరియల్ ఫేమ్) .. ఈ ముగ్గురూ వైల్డ్ కార్డ్ ఎంట్రీలు కన్ఫమ్ అయ్యినట్టు తెలుస్తోంది. తాజాగా ఆ లిస్ట్‌లో కావ్యశ్రీ కూడా చేరింది. గృహలక్ష్మి సీరియల్ లో కొడుకుగా చేసిన ప్రేమ్ కూడా వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇస్తున్నట్లు తెలుస్తోంది. అయితే వీరితో పాటుగా ప్రభాస్ శీను కూడా ఉన్నాడని తెలుస్తోంది. అలాగే అఖిల్ రాజ్ కూడా ఎంట్రీ ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

బిగ్ బాస్ సీజన్-9 లో ఇప్పటికే నలుగురు ఎలిమినేషన్ అయ్యారు. హౌస్ లో పన్నెండు మంది కంటెస్టెంట్స్ ఉండగా.. వారిలో ఇమ్మాన్యుయల్, రాము రాథోడ్ తప్ప మిగిలిన అందరు నామినేషన్లో ఉన్నారు. వైల్డ్ కార్డ్ ద్వారా ఎవరు వస్తే బాగుంటుందో‌ కామెంట్ చేయండి.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.