English | Telugu

Bigg Boss Telugu 8 Promo: బిగ్ బాస్ 8 ప్రోమో అదుర్స్.. ఈ సారి అన్ లిమిటెడ్ ఫన్!

తెలుగు బిగ్ బాస్ ప్రోమో వచ్చేసింది. తెలుగు టీవీ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న బిగ్ బాస్ లాంఛ్ కి సమయం ఆసన్నమైంది. ఇందులో ఇప్పటికే కొంతమంది కంటెస్టెంట్స్ లిస్ట్ ఫైనల్ అయింది.

తాజాగా విడుదలైన ప్రోమోలో రాజ్ తరుణ్- లావణ్యల విషయంలో మాట్లాడిన శేఖర్ బాషా వాయిస్ స్పష్టంగా తెలుస్తోంది. అతనేం అన్నాడంటే నాతో వైరం పెట్టుకుంటే టైటిల్ కొట్టుకుని వెళ్లిపోతానని చెప్పాడు. ఇక గతంలో కంటే భిన్నంగా ఈసారి కంటెస్టెంట్స్‌ను హౌస్‌లోకి పంపబోతున్నారు. ప్రతిసారీ ఒక్కొక్కర్నీ హౌస్‌లోకి పంపుతుండగా ఈసారి ఇద్దరు చొప్పున జంటగా పంపిస్తున్నారు. మరి ఆ ఏడు జంటలెవరంటో తెలియాలంటే సాయంత్రం వరకు ఆగాల్సిందే.

నేను మాత్రం మీ కళ్లల్లోకి చూసి మాట్లాడలేను.. ఎందుకంటే ఆ కళ్లల్లోకి చూసి మాట్లాడితే ఎక్కడ కొట్టుకుని పోతాననే భయం సర్ అని బిగ్ బాస్ కంటెస్టెంట్ బేబక్క అంది. ఇక తొలిరోజే కంటెస్టెంట్స్‌కి ఊహించని షాక్ ఇచ్చింది బిబి టీమ్. హౌస్‌లోకి అడుగుపెట్టిన తొలిరోజే ఎలిమినేషన్ ఉంటుందని చెప్పారు. ఆ ప్రాసెస్‌లో భాగంగా దర్శకుడు అనిల్ రావిపూడిని హౌస్‌లోకి పంపించారు. ఈసారి లిమిట్ లెస్ అంట.. ట్విస్ట్ అంట.. టర్న్ అంట.. ఇది ఫస్ట్ వీక్ నుంచే మొదలు పెడుతున్నారని చెప్పిన అనిల్ రావిపూడి.. ఇప్పుడు నేను ఒకర్ని బయటకు తీసుకుని వెళ్తున్నాను.. లక్కీ డ్రాలో వాళ్ల ప్లేస్ ఇంకొకర్ని స్వాప్ చేసి లోపలికి పంపిస్తామని చెప్తున్నాడు. అయితే ఇదేదో కంటెస్టెంట్స్‌ని టెన్షన్ పెట్టడానికి ఆడిన డ్రామాలాగే అనిపిస్తుంది. సెలెక్ట్ చేసి.. ఇంటర్వ్యూలు చేసి.. హౌస్‌లోకి పంపిన తొలిరోజే ఎలిమినేట్ చేయడం అయితే అంత నమ్మేట్టుగా లేదు. ఫన్ దర్శకుడుతో ఫన్ చేయిస్తున్నట్టుగానే ఉంది. నాని, రానా, నివేదా థామస్‌, ప్రియాంక మోహన్‌లు గెస్ట్‌లుగా వచ్చారు. గెస్ట్‌లుగా రావడమే కాదు.. బిగ్ బాస్ హౌస్‌లోకి కూడా వెళ్లారు. కంటెస్టెంట్స్ నవ్వుతూ సంతోషంగా ఉండటం చూసిన నాని.. మీ ఫ్యూచర్ నాకు అర్థమైపోతుందని అనేశాడు.

ఇక ఈ ప్రోమోలో ఎప్పటిలాగే కంటెస్టెంట్స్ ఫేస్ లు కనపడకుండా జాగ్రత్త పడ్డారు. ఇక ఈ రోజు రాత్రి ఏడు గంటలకి ప్రారంభమయ్యే బిగ్ బాస్ కోసం రెండు తెలుగు రాష్ట్రాల బిబి అభిమానులు ఎదురుచూస్తున్నారు. తాజాగా యూట్యూబ్ లో రిలీజైన ఈ ప్రోమో చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.

Podharillu:పొదరిల్లు సీరియల్ లో సూపర్ ట్విస్ట్.. మహాలక్ష్మికి పెళ్ళి ఫిక్స్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -02 లో.....మహాలక్ష్మి ప్రాజెక్ట్ డిజైన్ రెడీ చేసి హాల్లోకి వస్తుంది. వాళ్ళ నాన్న ప్రతాప్ ఇంకా అన్నయ్య మహాలక్ష్మికి డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తారు. ఒకసారి చూడు మహా అని వాళ్ళ అన్నయ్య అంటాడు. నాకేం ఇప్పుడు పెళ్లి వద్దు అవసరం అయితే వదిన నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోండి అని మహా అంటుంది. ఇప్పుడు డిజైన్స్ చూపించడానికి వెళ్తున్నానని తెలిస్తే డాడీ వద్దని అంటాడనుకొని డాడీ కాలేజీలో సర్టిఫికెట్ ఉన్నాయి తెచ్చుకుంటానని చెప్తుంది.