English | Telugu

బిగ్ బాస్ న్యూ స్ట్రాటజీ.. బీబీ జోడి తర్వాత ఓటిటి సీజన్‌!

బిగ్ బాస్ షో 2017లో మొదలయ్యింది. జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా చేసిన సీజన్ 1 సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత వరసగా సీజన్స్ ని తీసుకొచ్చారు మేకర్స్. బిగ్ బాస్ సీజన్ 6 పూర్తయ్యాక బీబీ జోడి పేరుతో ఒక షో స్టార్ట్ చేశారు.

ఇక ఇప్పుడు మరో స్ట్రాటజీ ప్లాన్ చేశారు. బిగ్ బాస్ ఓటిటిలో సీజన్2, అలాగే బిగ్ బాస్ తెలుగు సీజన్ 7కి సంబంధించి కొన్ని ఇంటరెస్టింగ్ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆడియన్స్ దృష్టి బిగ్ బాస్ మీద నుంచి పక్కకు పోకుండా ఉండడం కోసం కొత్త స్కెచ్ వేస్తున్నారు. బిగ్ బాస్ సీజన్ 7 కోసం ఫేమస్ హీరోలు, బుల్లితెర పాపులర్ యాక్టర్స్, సింగర్స్ ని అప్రోచ్ అవుతోంది బిగ్ బాస్ టీమ్. బిగ్ బాస్ జోడి డాన్స్ షో మార్చిలో పూర్తి కాగానే ఏప్రిల్‌లో ఓటిటి నాన్-స్టాప్ సీజన్‌ని స్టార్ట్ చేయడంకోసం ప్రణాళికలు రచిస్తోంది. ఐతే ఓటిటి సీజన్ 2ని ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేసేసి జూన్ మొదటి వారంలోకి పూర్తయ్యేలా చూస్తోంది.

అలాగే బుల్లితెర మీద సీజన్ 7ని సెప్టెంబర్‌లో నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారట. ఇక ఈ సీజన్‌కి హోస్ట్ గా నందమూరి బాలకృష్ణ, దగ్గుబాటి రానా ఎవరైనా రావొచ్చు అనే న్యూస్ వైరల్ అవుతోంది. బీబీ జోడి మాత్రం ప్రతీ వారం మంచి డాన్స్ పెర్ఫార్మెన్సెస్ తో ఆడియన్స్‌ని ఎంటర్టైన్ చేస్తోంది. ఈ బిగ్ బాస్ సీజన్, ఓటిటి వెర్షన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, హోస్ట్ ఎవరో తెలియాలంటే కొన్ని నెలలు వెయిట్ చేయాల్సిందే.