English | Telugu

పుట్టినరోజు వేడుకల్లో టైట్ హగ్ తో సిరి-శ్రీహాన్

యూట్యూబర్స్ సిరి హన్మంత్, శ్రీహాన్ బిగ్ బాస్ షో ద్వారా ఫుల్ పాపులర్ అయ్యారు. బిగ్ బాస్ సీజన్ 6 రన్నర్ అయ్యాడు శ్రీహాన్. ఇక అతనికి బిగ్ బాస్ 40 లక్షల సూట్ కేసు ఇచ్చి పంపించారు. ఇప్పుడు సోషల్ మీడియాలో వీళ్ళ ఇద్దరి ఫోటోలు చక్కర్లు కొడుతున్నాయి. శ్రీహాన్ తన స్నేహితురాలు సిరి హన్మంత్ పుట్టిన రోజు వేడుకల్ని చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేశాడు. అందుకు సంబంధించిన ఫొటోల్ని, వీడియోలను తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. ఈ ఫోటోలు చూస్తే గనక సిరి-శ్రీహాన్ గట్టిగా హగ్ చేసుకుని కనిపించారు. ఇలా వీళ్ళిద్దరూ సోషల్ మీడియాలో మరోసారి హాట్ టాపిక్ గా నిలిచారు.

" నా సక్సెస్ వెనక ఉన్న అందానికి పుట్టిన రోజు శుభాకాంక్షలు" అని ఒక టాగ్ లైన్ పెట్టాడు శ్రీహాన్. వీళ్ళిద్దరూ చాలా ఏళ్ళ నుంచి రిలేషన్ షిప్ లో ఉన్నారు. వీళ్లకు ఒక బాబు కూడా ఉన్నాడు. సిరి తన మేనమామ కొడుకు చైతుని దత్తత తీసుకుంది..అలా ఆ పిల్లాడిని వీళ్ళిద్దరూ కలిసి పెంచుకుంటున్నారు. శ్రీహాన్‌ని ఆ పిల్లాడు డాడీ డాడీ అంటూ పిలుస్తూ ఉంటాడు. తన పేరుని తన వీపు మీద పచ్చబొట్టుగా పొడిపించుకుని బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి శ్రీహాన్ ని సర్ప్రైజ్ చేసింది. ఇక ఇప్పుడు స్టార్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ప్రొడ్యూసర్ గా తెరకెక్కుతున్న ఒక వెబ్ సిరీస్ లో వీళ్ళు నటిస్తున్నారు. సుజీత్ రాజ్ డైరెక్షన్ లో ఈ సిరీస్ రాబోతోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో అనౌన్స్ చేస్తామని శేఖర్ మాస్టర్ చెప్పారు. బిగ్ బాస్ లో తాను నటుడిని కావాలని కల గన్నాడు..హౌస్ నుంచి బయటకు వచ్చాక తన కోరిక ఇలా తీరింది. ఇప్పుడు శ్రీహాన్ టైం స్టార్ట్ అయ్యింది. నటుడిగా దూసుకుపోవడానికి సిద్ధంగా ఉన్నాడు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.