English | Telugu

ఒక నైట్ కి ఎంత పే చేయాలి అన్నందుకు ఘాటుగా స్పందించిన ప్రియాంక సింగ్

జబర్దస్త్ ఫేమ్ సాయితేజ అలియాస్ ప్రియాంక సింగ్ గురించి అందరికీ తెలుసు.. రీసెంట్ గా వాళ్ళ పేరెంట్స్ కోసం ఇల్లు కూడా కట్టించి ఇచ్చింది. బిగ్ బాస్ సీజన్ 5 లోకి వెళ్ళాక ఆమె గురించి అందరికీ తెలిసింది. ఇప్పుడు ఆమె సోషల్ మీడియాలో ఫుల్ బిజీగా మారింది. ఫ్యాన్స్‌తో టచ్‌లోనే ఉంటూ ఎప్పుడూ ఏదో ఒక అప్‌డేట్ ని అందిస్తూనే ఉంది. అలాంటి ప్రియాంక సింగ్ "కాసేపు మాటాడుకుందామా" అంటూ తన ఫాన్స్ ని కవ్వించేసింది.

ఈ సందర్భంగా ఒక ఫ్యాన్ అడిగిన ప్రశ్నకు చాలా ఘాటుగా రియాక్ట్ అవుతూ ఆన్సర్ ని ఆడియో వీడియో రూపంలో తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేసుకుంది ప్రియాంక సింగ్. " నేను మీతో డేట్ చేయొచ్చా..ఒక నైట్ కి ఎంత పే చేయాలి " అని అడిగినందుకు " నాకు దీని గురించి పెద్దగా ఐడియా లేదు కానీ కచ్చితంగా డేట్ చేద్దాం.

ఫస్ట్ మీ డాడీ దగ్గరకు వెళ్లి మీ అమ్మగారి ముందు ఈ విషయాన్నీ అడుగు..నువ్వు అమ్మను ఫస్ట్ డేట్ కి పిలిచి ఎంత పే చేసావో చెప్పు...నేను ప్రియాంకాసింగ్ అనే అమ్మాయి దగ్గరకు డేట్ కి వెళ్లాలనుకుంటున్నాను..ఆమెకు ఎంత పే చేయాలి అని అడుగు. మీ డాడీ మీ అమ్మగారికి ఎంత పే చేశారో నాకు కూడా అంతే పే చెయ్యి" అని గట్టిగా వార్నింగ్ ఇచ్చిపడేసింది. అలాగే ఇంకో ఫ్యాన్ "పెళ్ళెప్పుడు మేడం" అని అడిగేసరికి "నాట్ ఇంట్రస్టెడ్" అని చెప్పింది. "మీ ప్రొఫైల్ పిక్ చూసాక మీ మీద ఇష్టం అంతా పోయింది" అని మరో ఫ్యాన్ అనేసరికి " నా పోస్ట్స్ చూసి నన్ను అంచనా వేయడం కరెక్ట్ కాదు.

నాకు రెస్పెక్ట్ వచ్చింది నా డ్రెస్సింగ్ సెన్స్ వల్ల కాదు నా హార్డ్ వర్క్ వల్ల. కాబట్టి ఇప్పటికైనా బుద్ది పెంచుకోండి...ప్రపంచాన్ని చూడండి" అని చెప్పింది. "ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏమిటి" అని అడిగిన క్వశ్చన్ కి " పాన్ ఇండియా మూవీస్ చేస్తున్నాను. ప్రస్తుతం నేను స్టార్ డైరెక్టర్స్ తో వర్క్ చేస్తున్నాను. వాళ్ళు అనౌన్స్ చేయకుండా నేను అనౌన్స్ చేయకూడదు. కాబట్టి ప్రస్తుతానికి నేను ఏమీ చెప్పలేను. త్వరలోనే వాటి అప్ డేట్స్ ని మీతో షేర్ చేసుకుంటాను" అని చెప్పింది.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.