English | Telugu

 ఒక ముద్దు కావాలని అడిగిన హరి...

ఆదివారం విత్ స్టార్ మా పరివారం ఈ వారం దుమ్ము రేపేదిలా కనిపిస్తోంది ప్రోమో చూస్తుంటే. దసరా ఫీవర్ ఇంకా ట్రెండింగ్ లోనే ఉంది. ఆల్రెడీ శ్రీదేవి డ్రామా కంపెనీలో జడ్జి ఇంద్రజ, ఢీ షోలో కొరియోగ్రాఫర్ గ్రీష్మ పసుపురంగు పెళ్లి బట్టల్లో ఒక ఊపు ఊపేసారు. ఇప్పుడు శ్రీముఖి వంతు వచ్చేసింది. ఈ వారం దసరా మూవీలో వెన్నెల గెటప్ లో వచ్చి స్టేజి మీద ధూందాం చేసేసింది తన డాన్స్ తో.."ఈ రోజు మా సీరియల్ పురంలో జరుపుకుంటున్నాం దసరా పండగా" అని మంచి జోష్ తో చెప్పేసింది. ఎక్స్ప్రెస్ హరి శ్రీముఖికి లవర్ గెటప్ లో కనిపించాడు. " ఎన్నిరోజులయ్యిందో నీకు లవర్ గా యాక్ట్ చేసి..ఒక ముద్దివ్వా..లవర్ కదా" అన్నాడు. "అన్నీ పెళ్లయ్యాకే.ఛీపో " అని సిగ్గుపడుతూ చెప్పింది శ్రీముఖి. "పెళ్లయ్యాక మీ ఆయన ఒప్పుకుంటాడా చెప్పు" అనేసరికి షాకయ్యింది శ్రీముఖి.

తర్వాత ఫైమా వచ్చి "కామెడీ గొప్పదా..రొమాన్స్ గొప్పదా" అనేసరికి "కామెడీ గొప్పది" అన్నాడు అవినాష్.."మరి అందరితో రొమాన్స్ చేస్తూ తిరుగుతావేంటి" అని వీపు విమానం మోతమోగించింది. ఇందులో "క్లాస్ వర్సెస్ మాస్" థీమ్ తో ఈ వారం షో జరగబోతోంది. క్లాస్ గెటప్స్ లో నిరుపమ్, రవికృష్ణ, మానస్ వచ్చారు. మాస్ టీమ్ లో అంబటి అర్జున్, సిద్దార్థ్ వర్మ, దీపికా, వాసంతి కృష్ణన్ వచ్చారు. "నిరుపమ్ బావా" అంటూ శ్రీముఖి సరదాగా ఆటపట్టించేసరికి ఆయన సిగ్గుపడిపోతూ " కర్రిగా ఉంటుంది కాకి, చెర్రీలా ఉంటుంది శ్రీముఖి" అని చెప్పాడు. ఇక ఈ రెండు టీమ్స్ మంచి గేమ్స్ ఆడించింది శ్రీముఖి. మరి ఏమేం గేమ్స్ ఆడించింది...వాళ్ళు ఎలా ఆడారో తెలియాలంటే సండే ఫండే వరకు వెయిట్ చేయాల్సిందే.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.