English | Telugu

బ్యాటరీ ఈజ్ ఫుల్ ఛార్జ్, కంటెస్టెంట్స్ ఇన్ ఫుల్ జోష్!


ముప్పై తొమ్మిదవ రోజు బిగ్ బాస్ సరికొత్తగా ఆరంభమైంది. 'బ్యాటరీ ఛార్జ్' టాస్క్ లో భాగంగా ఒక్కొక్కరు తమ ఫ్యామిలితో సరదగా మట్లాడుతూ ఎమోషన్స్ ని పంచుకొన్నారు. ఈ టాస్క్ తో హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరు ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యారు.

"ఈ రోజు టాస్క్ లో భాగంగా, ఫోన్ రింగ్ అవ్వగానే ఎవరు ఫస్ట్ లిఫ్ట్ చేస్తారో వారికే ఫ్యామిలితో మాట్లాడే అవకాశం లభిస్తుంది" అని బిగ్ బాస్, కంటెస్టెంట్స్ కి వివరించాడు. కాసేపటికి ఫోన్ రింగ్ రాగానే సూర్య కాల్ లిఫ్ట్ చేసాడు. అతడికి రెండు ఆప్షన్స్ ఇవ్వగా, అందులో తన అమ్మ రాసిన ఉత్తరం కావాలనే ఆప్షన్ ని ఎంచుకొన్నాడు. తర్వాత ఆ లెటర్ రాగానే‌ దాన్ని చదువుకుంటు, చాలా ఏడ్చేసాడు. బాధలో ఉన్న సూర్యని చూసి హౌస్‌ మేట్స్ ఓదార్చారు. ఆ తర్వాత కాల్ రేవంత్ ఆన్సర్ చేసాడు. రేవంత్ కి ఇచ్చిన రెండు ఆప్షన్స్ లో తన భార్య ఫోటో కావాలనే ఆప్షన్ ని ఎంచుకొన్నాడు. కాగా ఆ ఫోటో రాగానే చూసుకొంటు ఏడ్చేసాడు.

ఆ తర్వాత వసంతి కాల్ అన్సర్ చేసింది. తన మేనకోడలు ఫోటోని కోరగా, కాసేపటికి అది వచ్చింది. ఆ ఫోటో చూస్తూ ఏడ్చేసింది వసంతి. ఆ తర్వాత రాజ్ కి అవకాశం లభించింది. రాజ్ వాళ్ళ అమ్మతో మాట్లాడే ఆప్షన్ ని ఎన్నుకొన్నాడు. కాసేపటికి ఇంటి దగ్గర నుండి వాళ్ళ అమ్మ కాల్ చేసి మాట్లాడుతూ, "నీ ఆట ఇంకా మెరుగుపరుచుకోవాలి. ఆ రోజు గీతుతో ఎలా మట్లాడినావో, అందరితో అలాగే మాట్లాడు, గట్టిగా మట్లాడు. నీ తప్పు లేనప్పుడు భయపడకుండా గట్టిగ మాట్లాడాలే " అని రాజ్ తో చెప్పుకొచ్చింది.

బ్యాటరీ ఛార్జ్ పూర్తిగా అయిపోవడంతో టాస్క్ పూర్తి అయ్యింది. హౌస్ మేట్స్ బాగా పర్ఫామెన్స్ చేయడంతో, ఈ వారం అందరికి పోటీదారులు అవ్వడానికి అందరికి సమాన అవకాశాలు కల్పించాడు. ఆ తర్వాత 'బాల్ త్రో బాస్కెట్' టాస్క్ కి ఎన్నుకోబడ్డారు ‌. అయితే ఆ టాస్క్ లో రేవంత్ వసంతి, ఆదిరెడ్డి, సూర్య, శ్రీసత్య, రాజ్ ,అర్జున్, రోహిత్ కెప్టెన్సీ పోటీదారులుగా రెండవ టాస్క్ ఆడటానికి ఎంపికయ్యారు.

Karthika Deepam2 : కాశీ అకౌంట్ లో అయిదు లక్షలు.. స్వప్న చూసి షాక్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -551 లో..... కాంచన అన్న మాటలకి శ్రీధర్ బాధపడుతాడు. తినడం మానేస్తాడు. కార్తీక్ వచ్చి నాన్న భోజనం చెయ్యమని తినిపిస్తుంటే ముద్ద దిగడం లేదురా అని ఏడుస్తాడు. ఎందుకు అమ్మ ఇవన్నీ ఇప్పుడు.. ఎప్పటిలాగే మాట్లాడుకోవచ్చు కదా అని కార్తీక్ అంటాడు. నేను కావేరి తరుపున వచ్చాను.. తను ఫోన్ చేసి భయపడుతుంటే చూడలేక వచ్చానని చెప్తుంది. దాంతో శ్రీధర్ బాధపడుతూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇక కాంచనని కార్తీక్ తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతాడు.