English | Telugu
బట్టలెక్కువ వేస్కుంటే వాళ్ళే విజేత.. ఇదెక్కడి టాస్క్ రా సామి!
Updated : Oct 27, 2023
బిగ్ బాస్ సీజన్-7 ప్రేక్షకులకి వినోదాన్ని పంచుతు వస్తుంది. అయితే రోజుకో టాస్క్ తో కంటెస్టెంట్స్ నుండి వీలైనంత ఎంటర్టైన్మెంట్ ని బయటకు తెప్పిస్తున్నాడు బిగ్ బాస్.
మొదటి రోజు జరిగిన టస్క్ లో.. పల్లవి ప్రశాంత్, ప్రియాంక జైన్ గెలిచిన విషయం తెలిసిందే. అయితే ఈ రోజు జరిగిన టాస్క్ లలో మొదటి గేమ్ గౌతమ్ కృష్ణ గెలిచాడు. రెండవ గేమ్ లో ప్రిన్స్ యావర్, టేస్టీ తేజ, శోభాశెట్టి పాల్గొన్నారు. అయిదుగురికి ఒక టాస్కు పెట్టాడు బిగ్‌బాస్. తేజ, యావర్, అర్జున్, అశ్విని, శోభాలలో చర్చించుకొని కేవలం ముగ్గురే ఈ గేమ్ ఆడాలి. ఇందులో ఎవరు గెలిస్తే వారు మరో కెప్టెన్సీ కంటెండర్ అవుతారన్నమాట. అయితే శోభా గొడవ తట్టుకోలేక అర్జున్, అశ్విని పోటీ నుంచి తప్పుకొని యావర్, తేజ, శోభాలను గేమ్ కోసం పంపించారు. ఇక ఈ గేమ్ గెలవడానికి వీలైనన్నీ ఎక్కువ బట్టలు వేసుకోవాల్సి ఉంటుందని బిగ్ బాస్ కోరాడు.
ఇక ఈ ఆటకి సంచాలకుడిగా శివాజీ ఉన్నాడు. వీలైనన్ని బట్టలు వేసుకోమని బిగ్ బాస్ చెప్పగా.. టేస్టీ తేజ హౌస్ లో ఎవరి బట్టలు వదలలేదు, టీ షర్ట్, షర్ట్, ప్యాంట్, పంచె, డ్రాయర్ ఇలా ఏది పడితే అది వేసుకున్నాడు. దేన్ని వదలలేదు. అన్ని వేసుకున్న ఈ టాస్క్ లో ఓడిపోయి కంటెండర్ పోటీ నుండి తప్పుకున్నాడు. ఆ తర్వాత శోభాశెట్టి 72 రకాల బట్టలు వేసుకొని మొదటి స్థానంలో ఉండగా, 70 రకాల బట్టలు యావర్ వేసుకొని రెండవ స్థానంలో నిలిచాడు. దీంతో కెప్టెన్సీ కోసం పల్లవి ప్రశాంత్, గౌతమ్ కృష్ణ, ఆట సందీప్, శోభాశెట్టి, ప్రియాంక జైన్ చివరి టాస్క్ ఆడాల్సి ఉంది. మరి వీరిలో ఈ వారం ఎవరు కెప్టెన్సీగా గెలుస్తారనే ఆసక్తి అందరిలో నెలకొంది.