English | Telugu
మానస్ హౌస్ లో చెప్పిందే చేశాడుగా!
Updated : Jan 4, 2022
బిగ్‌బాస్ సీజన్ 5తో మానస్ కు మంచి పేరొచ్చింది. మిగతా కంటెస్టెంట్ లకు పూర్తి భిన్నంగా కామ్ అండ్ సెటిల్డ్ .. మెచ్చూర్డ్ గా వ్యవహరించి మానస్ అందరి మనసులు దోచుకున్నాడు. టైటిల్ గెలవలేకపోయినా టాప్ 5లో నిలిచి తన సత్తా చాటాడు. ఇక ప్రియాంక విషయంలో అతనిపై కొంత నెగటివిటీ స్ప్రెడ్ అయింది. అయితే తనని నొప్పించినా ఆమెని మెప్పించిన తీరు.. సున్నితంగానే ప్రియాంకని హెచ్చరించిన తీరు వీక్షకుల్ని ఆకట్టుకుంది.
ఇక హౌస్ నుంచి బయటికి వచ్చిన వారికి క్రేజ్ వుంటుంది కానీ దాన్ని ఎలా వాడుకోవాలో అలా వాడుకుంటేనే వారి కెరీర్ ముందుకు సాగుతుంది. ఈ విషయంలో ఇప్పటికే కొంతమంది సక్సెస్ అయితే మరి కొంతమంది ఫెయిల్ అయిపోయారు. తాజాగా బయటికి వచ్చిన కంటెస్టెంట్ లలో అయితే కొంతమంది ఇప్పటికే సినిమాల ఛాన్స్ లు కొట్టేశారు. ఇంకొంత మంది ఛాన్సుల కోసం ఎదురుచూస్తున్నారు. మరి కొంతమంది ఏది చేస్తే బాగుంటుందని ఇంకా ఆలోచిస్తూనే వున్నారు.
ఇదిలా వుంటే తను హౌస్ నుంచి బయటికి వెళ్లాక ఏం చేయబోతున్నానో మానస్ ముందే చెప్పేసిన విషయం తెలిసిందే. తాను ఓ ప్రొడక్షన్ హౌస్ ని స్టార్ట్ చేస్తానని, కొత్త వారికి అవకాశాలు ఇస్తూ కొత్త తరహా సినిమాలకు శ్రీకారం చుడతానని చెప్పాడు. చెప్పిన ప్రకారమే సినిమా ఆఫీస్ ఓపెన్ చేశాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలని మానస్ తాజాగా సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి.