English | Telugu

అన్ని డాన్స్ షోస్‌లో కింగ్ 'డాన్స్ ఐకాన్‌'!

'డాన్స్ ఐకాన్' పేరుతో ఆహా ఓటీటీలో ఇప్పుడు సరికొత్త డాన్స్ షో స్టార్ట్ అయ్యింది. ఈ షోకి యాంకర్ ఓంకార్ హోస్ట్ గా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ షోకి రమ్యకృష్ణ, శేఖర్ మాస్టర్ జడ్జెస్ గా వ్యవహరిస్తున్నారు. ఈ షో "కింగ్ ఆఫ్ ఆల్ డాన్స్ షోస్" అంటూ రమ్యకృష్ణ కితాబిచ్చారు. రీసెంట్ గా డ్యాన్స్ ఐకాన్ ఎపిసోడ్ ప్రోమోని విడుదల చేశారు ఆహా టీం. ఈ ప్రోమోలో డాన్సర్లు తమ పవర్ ప్యాక్ పెర్ఫార్మెన్సులతో స్టేజి మీద పూనకం తెప్పించారు.

శేఖర్ మాస్టర్, శివగామి దేవి ఇద్దరూ ఫుల్ జోష్ తో కనిపించారు. యశ్వంత్ మాస్టర్ కంటెస్టెంట్స్ తో కలిసి స్టెప్పులేసరికి వన్స్ మోర్ అంటూ విజిల్స్ పడ్డాయి. "ఎవరైనా డాన్స్ చేస్తే వాళ్లకు అలుపొస్తుందేమో.. మాకు మాత్రం ఊపొస్తుంది" అంటూ బాలకృష్ణ లెవెల్లో శ్రీముఖి చెప్పిన మాస్ డైలాగ్ అదిరిపోయింది.

రమ్యకృష్ణ వన్స్ మోర్ అనేసరికి శ్రీముఖి ఇంకా రెచ్చిపోయి మళ్ళొకసారి ఆ డైలాగ్ చెప్పి ఫుల్ ఎంటర్టైన్ చేసేసింది. "స్వింగ్ జరా" సాంగ్ కి అదరగొట్టేసింది.ఒక లేడీ కంటెస్టెంట్ ని శేఖర్ మాస్టర్ "నువ్వు హీరోయిన్ మెటీరియల్" అంటూ కాంప్లిమెంట్ ఇచ్చేసారు. ఇలా లేటెస్ట్ గా రిలీజైన‌ప్రోమో ఫుల్ కలర్ ఫుల్ గా ఉంది. సెప్టెంబర్ 17 నుండి ప్రతి శని, ఆదివారాల్లో రాత్రి 9 గంటలకు ఈ డాన్స్ ఐకాన్ షో ప్రసారం కానుంది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.