English | Telugu
బిందు కోసం హీరో ట్వీట్.. ఏం జరుగుతోంది?
Updated : Apr 13, 2022
బిగ్‌బాస్ బిందు సీక్రెట్ లవ్ ట్రాక్?
అనీష్ కురువిల్ల తొలి సారి డైరెక్ట్ చేసిన చిత్రం `ఆవకాయ్ బిర్యానీ`. ఈ చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైన బిందు మాధవి ఆ తరువాత తమిళ చిత్రసీమకే పరిమితమైపోయింది. తెలుగులో కంటే తమిళంలోనే ఎక్కువగా పేరు తెచ్చుకుంది. అయితే బిగ్‌బాస్ నాన్ స్టాప్ ఓటీటీతో మళ్లీ ఇన్నాళ్లకు తెలుగులో బిందు మాధవి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఓటీటీ బిగ్ బాస్ లో తనదైన మార్కుని ప్రదర్శిస్తూ రచ్చ రచ్చ చేస్తోంది. తనని టార్గెట్ చేసిన అఖిల్ ని ఓ రేంజ్ లో ఆడేసుకుంటోంది.
`ఆవకాయ్ బిర్యానీ` తరువాత తెలుగులో కొన్ని చిత్రాల్లో నటించినా పెద్దగా ఫిలితం లేకపోవడంతో నేచురల్ స్టార్ నాని నటించిన `పిల్ల జమీందార్` తరువాత నుంచి తెలుగులో కనిపించకుండా పోయింది. ఇక్కడ అవకాశాలు రాకపోవడం.. తమిళ ఇండస్ట్రీ నుంచి అవకాశాలు రావడంతో అక్కడికే మకాం మార్చేసింది. గత కొంత కాలంగా తమిళ చిత్రాల్లో మెరుస్తున్న బిందు మాధవి సడన్ గా ఓటీటీ బిగ్ బాస్ తో తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చింది.
లేడీ అర్జున్ రెడ్డిలా హల్ చల్ చేస్తూ సింగిల్ గానే అఖిల్ గ్రూప్ ని చెడుగుడు ఆడేస్తోంది. దీంతో సోషల్ మీడియాలో బిందు మాధవికి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ మొదలైంది. దీంతో అనూహ్యంగా టైటిల్ హాట్ ఫేవరేట్ గా మారిపోయింది. ఇటీవల నామినేషన్ ప్రక్రియలో భాగంగా అఖిల్ తో జరిగిన రభస లో ఏకంగా అరేయ్ అఖిల్ గా .. చెప్పురా.. అంటూ షాకిచ్చింది. బిందు దెబ్బ కి తట్టుకోలేక అఖిల్ అబ్బా అనేశాడు. ఇదిలా వుంటే బిందు మాధవి ఓ తమిళ హీరోతో సీక్రెట్ ప్రేమాయణం నడుపుతోందంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
ఇందుకు కారణం బిందు మాధవికి సపోర్ట్ చేస్తూ తమిళ హీరో, జెర్సీ ఫేమ్ హరీష్ కల్యాణ్
ప్రత్యేకంగా ట్వీట్ చేయడమే. గతంలోనూ వీరిద్దరు రిలేషన్ లో వున్నారని ప్రచారం జరిగింది. తాజా ట్వీట్ తో అది మరింత బలపడుతోంది. మరి ఈ ట్వీట్ గురించి బిందు ఏమంటుందో చూడాలి.