English | Telugu

ఇలా చేస్తే ప్రేమ పెరుగుతుంది.. ఐ ఆమ్ సో సారీ!

శ్రీ సత్య బిగ్ బాస్ కంటెస్టెంట్ గా బాగా ఫేమస్ ఐన బుల్లితెర నటి. బిగ్ బాస్ కంటెస్టెంట్ కంటే ముందు ఆమె సీరియల్ నటిగా మంచి పేరు తెచ్చుకుంది. ముద్దమందారం , త్రినయని, నిన్నే పెళ్ళాడతా, అత్తారింట్లో అక్కా చెల్లెళ్లు వంటి సీరియల్స్ ద్వారా ఆమె బాగా పాపులర్ అయ్యింది. రీసెంట్ ఆమె తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో తన ఫాన్స్ అడిగిన ప్రశ్నలకు జవాబులు చెప్పింది. అందులో " అక్కా నువ్ మళ్ళీ త్రినయని సీరియల్ లోకి రావొచ్చుగా..నువ్ ఉంటేనే ఆ సీరియల్ బాగుంది" అని ఒక ఫ్యాన్ అడిగేసరికి "ఈ ప్రశ్న నన్ను చాల మంది అడుగుతున్నారు. మీరంతా మళ్ళీ నన్ను సుగుణగా చూడాలి అనుకుంటున్నారు. కానీ నాకు రావడానికి కుదరదు. ఐ ఆమ్ సో సారీ" అని రిప్లై ఇచ్చింది.

"మన మీద మనకు ప్రేమ పెరగాలంటే ఏం చేయాలి" అని ప్రశ్నకు " మీ దగ్గర ఉన్న ప్రేమనంతా మీకు నచ్చిన వాళ్ళ మీద చూపించండి. వాళ్ళు ఎలాగో అంత ప్రేమ చూపించరు. పోనీ చూపించినా ఎక్కువ రోజులు చూపించరు...అప్పుడు మీరు బాధపడతారు. ఆటోమేటిక్ గా మీ మీద మీకు ప్రేమ అనేది పెరుగుతుంది" అంటూ వేదాంతం చెప్పింది శ్రీసత్య. ఈమె హీరో రామ్‌కి వీరాభిమాని. ‘నేను శైలజ’ మూవీలో హీరో రామ్ మాజీ గర్ల్ ఫ్రెండ్‌గా నటించి.. తన అభిమాన హీరోతో నటించాలనే కోరికను నెరవేర్చుకుంది. యాక్టింగ్‌పై ఇంటరెస్ట్ తో మోడలింగ్ రంగంలోకి ఎంటరయ్యి మిస్ విజయవాడ, మిస్ ఆంధ్రప్రదేశ్ టైటిల్స్ గెలుచుకుంది. లవ్ స్కెచ్, తరుణం, ఏఎన్ఆర్ కన్ఫ్యూజ్ అయ్యాడు, అంతా భ్రాంతియేనా వంటి షార్ట్ ఫిలిమ్స్‌లో నటించింది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.