English | Telugu

Bigg Boss 9 Telugu Nominations: సుమన్ శెట్టి వ్యాలిడ్ నామినేషన్.. కంటెస్టెంట్స్ అంతా నవ్వులే నవ్వులు!


బిగ్ బాస్ సీజన్-9 లో నామినేషన్లు ఫుల్ హీటెడ్ గా జరిగాయి. హౌస్ లోని కంటెస్టెంట్స్ మధ్య భేదాభిప్రాయాలు మొదలయ్యాయి. నిన్నటి ఎపిసోడ్ లో రీతూ మొదటగా భరణి, దివ్యలని నామినేట్ చేసింది. తర్వాత సంజన వచ్చి రాము, భరణిలని నామినేట్ చేసింది.

ఆ తర్వాత బాల్ అయేషాకి రావడంతో తను సుమన్ శెట్టి చేతికి ఇచ్చింది. సుమన్ శెట్టి ముందుగా తనూజని నామినేట్ చేశాడు. లాస్ట్ వీక్‌లో గేమ్స్‌కి టీమ్‌లు ఏర్పడేటప్పుడు నాతో టీమ్‌ అవుతానని నాకు మాట ఇచ్చావ్.. కానీ సైలంట్‌గా కళ్యాణ్‌తో వెళ్లిపోయావ్ నువ్వు.. నాతో నువ్వు ఆడుంటే ఇంకా బాగా నాకు ఉపయోగపడేదేమో.. అలానే నువ్వు హౌస్‌లో చాలా ఎమోషనల్ అయిపోతున్నావ్.. సెంటిమెంట్ ఎక్కువైపోయిందనిపిస్తుంది అంటూ సుమన్ శెట్టి చెప్పాడు. దానికి తనూజ మీకు చెప్పాను కదా అన్న ఎవరైనా అడిగితే నేను వెళ్ళిపోతాను.. మీరు ఫీల్ అవ్వరు కదా అని అడిగాను కదా సుమన్ అన్న అంటూ తనూజ చెప్పింది. లేదమ్మా నువ్వు నాతో అనలేదు.. నాతో అని ఉంటే నేనెందుకు ఇలా చెప్తానమ్మ అంటు సుమన్ శెట్టి అన్నాడు‌. మీ ట్రూ కలర్స్ కన్పిస్తున్నాయి అన్న.. నేను మిమ్మల్ని నమ్మాను.. కానీ మీరు రివేంజ్ నామినేషన్ చేసి ఏదో రీజన్ చెప్తున్నారు సుమన్ అన్నా అంటూ తనూజ అంది.

ఇక ఆ తర్వాత సంజనని నామినేట్ చేశాడు సుమన్ శెట్టి. హౌస్‌లో ఏదైనా గొడవ జరుగుతుందంటే మీకెందుకమ్మా అంత సంతోషం.. వెళ్లి ఆపాలి కానీ అలా మీరు ఎంజాయ్ చేస్తారా అని సుమన్ శెట్టి యాక్షన్ చేసి చూపించడంతో హౌస్‌లో అందరు తెగ నవ్వుకున్నారు. హౌస్ లోని వాళ్ళంతా మనవాళ్ళు.. మనవాళ్ళు అక్కడ అలా గొడవ పడుతుంటే రీతూ, మీరు వెళ్లి తెగ నవ్వుకుంటారా.. ఇదేంటండి.. అది నాకు నచ్చలేదంటు సంజనని నామినేట్ చేశాడు సుమన్ శెట్టి. ఇక సంజనని సేవ్ చేసి తనూజని నామినేట్ చేసింది అయేషా‌. సుమన్ శెట్టి నామినేషన్ మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.

Karthika Deepam2 : దాస్ ని నిజం చెప్పకుండా ఆపిన కార్తీక్.. దీప ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -566 లో.. జ్యోత్స్న గురించి శివన్నారాయణకి దాస్ నిజం చెప్పాలని అనుకుంటాడు. జ్యోత్స్న, పారిజాతం టెన్షన్ పడుతారు. దాస్ ని జ్యోత్స్న  కొట్టిన విషయం చెప్తాడు కావచ్చని దశరథ్ అనుకుంటాడు. జ్యోత్స్న గురించి ఇప్పుడే నిజం తెలియొద్దని దాస్ ని ఆపాలని కార్తీక్ ట్రై చేస్తాడు.. దాస్ నిజం చెప్పబోతుంటే ఒకవైపు దశరథ్.. ఒకవైపు కార్తీక్.. ఒకేసారి దాస్ ని ఆగమంటారు. దాస్ ఏదో ..చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావ్ పక్కకిరా.. నాతో చెప్పమని దశరథ్ అంటాడు.