English | Telugu

Bigg Boss 9 Telugu : భరణితో బలగం2.. బిగ్ బాస్ హౌస్ లో కొత్త కుటుంబం!

బిగ్ బాస్ హౌస్ లోకి రావాలంటే రాసి పెట్టి ఉండాలని, వన్ టైమ్ ఆచీవ్మెంట్ అని అంటారు. హౌస్ లోకి వచ్చి కాస్త ఫేమ్ సంపాదించి తమకంటూ ఇమేజ్ ని క్రియేట్ చేసుకుంటారు. అయితే బిగ్ బాస్ హౌస్ హిస్టరీ లోనే లేని విధంగా ఈ సీజన్ లో ఎన్నో బంధాలు పెనవేసుకొని ఉన్నాయి. కంటెస్టెంట్స్ కప్ కోసమో లేక బంధాలు పెంచుకోవడం కోసమో ఈ సీజన్-9 కి వచ్చారో అర్థమవ్వడ‌ం లేదు.

బిగ్ బాస్ హౌస్ ఇప్పుడు ఒక మమతల కోవెల.. అందులో అన్ని బంధాలు ఉంటాయని చెప్పిన ఏకైక సీజన్ ఏదంటే అది బిగ్ బాస్ 9. ఈ సీజన్-9 ఇంటి పెద్ద ఎవరంటే మన రేలంగి మావయ్య భరణి.. అతనే మహావృక్షం. అతనికి ఇద్దరు కూతుళ్లు.. చిన్న కూతురు దివ్య, పెద్ద కూతురు తనూజ. ఇక కంటెస్టెంట్స్ అందరు కూడా అన్నయ్య, బాబాయ్, మామ అంటూ భరణిని పలకరిస్తుంటారు. ఇలా భరణికి పెద్ద బలగమే ఉంది. ఈ సీజన్ అయ్యాక భరణితో బలగం-2 తీసిన పెద్ద హిట్టే అవుతుంది. ఎందుకంటే అలా అన్ని బంధాలని పెనవేసుకున్నాడు భరణి. ఇక బంధాలకి పుట్టినిళ్ళుగా మారింది సీజన్-9 బిగ్ బాస్ హౌస్.

మరోవైపు హౌస్ లో లవ్ ట్రాక్ లు కూడా ఉన్నాయి. అసలు హౌస్ లోకి ఏ పర్పస్ తో వచ్చారన్న విషయమే మర్చిపోయారు కొందరు. మన యువ జంట రీతూ చౌదరి, డీమాన్ పవన్ సందు దొరికితే చాలు హగ్ ఇచ్చుకుంటున్నారు. హౌస్ లో ఈ ఇద్దరు కరువులో ఉన్నట్లు వారి చేష్టలున్నాయి. ఇక కళ్యాణ్, తనూజ వీళ్లు లవ్ ట్రాక్ నడపలేకపోయారు. ఎందుకంటే కళ్యాణ్ కంటే తనూజ రెండేళ్లు పెద్దదట.. వీళ్లతో ఏమాయ చేసావే-2 తీస్తే సెట్టు.

బిగ్ బాస్ హౌస్ లో పెనవేసుకున్న ఇంకొక బంధం తల్లి, కొడుకుల బంధం. సంజన, ఇమ్మాన్యుయల్.. ఇద్దరి బాండింగ్ చూస్తుంటే సొంత తల్లీకొడుకులు కూడా అలా ఉండరేమో.. మమ్మీ అంటూ ఇమ్మాన్యుయల్ బిడ్డ అంటూ సంజన.. ఇద్దరికి ఇద్దరు సరిపోయారు. తాజాగా ఒక ఎపిసోడ్ లో.. నా తల్లి తర్వాత సంజనని అమ్మ అని పిలిచానని ఇమ్మాన్యుయల్ అన్నాడు. తన కోసం ఈ పాట అంటూ సువ్వి సువ్వాలమ్మ పాటని పాడి వినిపించాడు. దీన్ని బట్టి చూస్తే అందరు గేమ్స్ కంటే బంధాలకి ఎక్కువ టైమ్ కేటాయిస్తున్నారు. వెళ్ళందరు కెమెరా స్క్రీన్ స్పేస్ కోసం చేస్తున్నారా లేదంటే నిజమైనా ఎమోషనా అనేది తెలియాలంటే మరికొన్ని వారాలు ఆగాల్సిందే.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.