English | Telugu
వరుణ్ తేజ్ నెక్ట్స్ మూవీలో సాంగ్ పాడనున్న తెలుగు ఇండియన్ ఐడల్ ధీరజ్
Updated : Oct 11, 2025
తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 4 ఈ వారం ఎపిసోడ్ ఫుల్ ఎంటర్టైన్ చేసింది. ఇక ఇందులో సింగర్ ధీరజ్ రావడంతోనే జడ్జెస్ కి పాల కోవాలా పాకెట్స్ పట్టుకుని వచ్చాడు. థమన్ ఇంతకు ముందు ఎపిసోడ్స్ లో పాల కోవాల కోసం అడిగితే ఇప్పుడు వాటిని తెచ్చి ఇచ్చాడు. ఇక కోర్ట్ మూవీలో సాంగ్ పాడి అలరించాడు. ఇక జడ్జెస్ కి కూడా ఈ పాట బాగా నచ్చేసింది. "ఎగ్జాం పేపర్ లో వస్తుంది ఫిల్ ఇన్ ది బ్లాంక్. నీ పెర్ఫార్మెన్స్ కి నేను వేస్తా ఫస్ట్ రాంక్" అంటూ కాంప్లిమెంట్ ఇచ్చాడు కార్తీక్. "ఎం పాడావురా..ఇంత ఉందా నీలో అనేలా ఉందిరా. రేపు మార్నింగ్ నా స్టూడియోకి రా ఒక సాంగ్ ఉంది నీకు. వరుణ్ తేజ్ నేనొక సినిమా చేస్తున్న. కొరియన్ కనకరాజు అని..ఆ సినిమాలో ఒక సాంగ్ నా కోసం పాడాలి..నేను ఇంకా డైరెక్టర్ ని, హీరోని కూడా అడగలేదు.
కానీ నేను నీకోసం ఫైట్ చేస్తా " అంటూ థమన్ బిగ్ ఆఫర్ ఇచ్చాడు. ఇక కార్తీక్ ఐతే ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేసరికి జనవరిలో అని చెప్పాడు. సరే ఇంకో ఆఫర్ కూడా నేను ఇస్తున్నా ఫిబ్రవరి 14 న నా షో హైదరాబాద్ లో ఉంది. నువ్వొచ్చి నా షోని స్టార్ట్ చేయాలి అని చెప్పారు. ఇక ప్రతీ సీజన్ నుంచి కూడా ఇక్కడ పాడే సింగర్స్ కి ఏదో ఒక ఆఫర్స్ ఇస్తూ కొత్త కొత్త మూవీస్ లో సాంగ్స్ పాడిస్తూ ఎంకరేజ్ చేస్తున్నారు జడ్జెస్. ఇక తర్వాత ఈ షోలో సాంగ్స్ పాడిన డల్లాస్ డైనమైట్ స్నిగ్ద, శ్వేతా పాడిన సాంగ్స్ కి కార్తీక్ కొన్ని ఇన్ పుట్స్ చెప్పాడు. అలా వాళ్ళతో మళ్ళీ సాంగ్స్ పాడించి సరదాగా ఎంటర్టైన్ చేశారు.